- Telugu News Photo Gallery Cinema photos Heroine Anushka Shetty joined in her new movie kathanar sets Telugu Actress Photos
Anushka Shetty: కథనర్ సెట్‌లో జాయిన్ అయిన అనుష్క.! మరి తెలుగు మూవీస్ చెయ్యరా.?
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది అనుష్క.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..?
Updated on: Mar 13, 2024 | 8:06 PM

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత అనుష్క అజ్ఞాతవాసంలో ఎందుకున్నారు..? బయటకి ఎందుకు రావట్లేదు..? అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తున్నారు..? నటిస్తున్నారా లేదంటే సైలెంట్‌గా రిటైర్ అయిపోయారా..? స్వీటీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది అనుష్క.

కానీ ఆ మూవీ రిలీజ్ ఎప్పుడో ఇంకా తెలియదు. ప్రస్తుతం క్రిష్‌తో చేస్తున్న సినిమా అయినా త్వరగా కంప్లీట్ కావాలని, ఏదోలా ఈ ఇయర్ ఎండింగ్‌లోపు తమని పలకరించేయాలని కలలు కంటున్నారు స్వీటీ సైన్యం.

కొన్నేళ్లుగా ఈమె రెగ్యులర్‌గా సినిమాలు చేయకపోయినా స్వీటీ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెతో నటించడానికి స్టార్స్ ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఈమె మాత్రం బాహుబలి తర్వాత ఆ రేంజ్‌లో సినిమాలకు సైన్ చేయట్లేదు.

Anushka Shetty Look

మలయాళంలో మాత్రం కథనర్ సినిమాకు ఓకే చెప్పారు అనుష్క. ఈ సినిమా సెట్స్‌లోనే జాయిన్ అయ్యారిప్పుడు. 9వ శతాబ్దపు కడమత్తు అనే క్రిస్టియన్ మత బోధకుడు, యోధుడి కథే కథనర్ సినిమా.

కథనర్ హయాంలోని కల్లియన్ కట్టు నీలి అనే పాత్రలో అనుష్క నటిస్తున్నారిప్పుడు. రోజిన్ థామస్ దీనికి దర్శకుడు. దేవదాసి కూతురిగా పుట్టి అనూహ్య పరిణామాల వల్ల చేతబడులకు గురై చివరికి ఆత్మగా మారే పాత్ర ఇదని తెలుస్తుంది.

అరుంధతి, భాగమతి తరహాలోనే ఇందులో అనుష్క పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది. 2 భాగాలుగా రానున్న కథనర్.. 2025 సమ్మర్‌లో విడుదల కానుంది.




