- Telugu News Photo Gallery Are you eating these foods before going to bed? The cause of sleep disturbance
Sleeping Disorder: నిద్రపోయే ముందు ఈ ఫుడ్స్ తింటున్నారా.? నిద్ర భంగానికి కారణం..
తగినంత ఆహారం తీసుకోవడమే కాకుండా.. కంటి నిండా నిద్ర పడితే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడని పెద్దలు అంటుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో నిద్ర ఒకటి. ఓ వ్యక్తి నిర్దిష్ట సమయం కంటే తక్కువ గంటల నిద్రపోతే.. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని ఈ ఆహార అలవాట్లు కారణం కావచ్చు. అందుకే నిద్రపోయే ముందు పలు ఆహారాలను దూరంగా పెడితే.. కంటి నిండా నిద్ర పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 09, 2025 | 8:30 PM

నాన్-వెజ్: మాంసాహారంలో కొవ్వు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణం అయ్యేందుకు కూడా చాలా సమయం పడుతుంది. అందుకే రాత్రిపూట మాంసాహరానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

స్పైసీ ఫుడ్: స్పైసీ ఫుడ్ ఏ సమయంలో తిన్నా కూడా కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అయితే డిన్నర్‌లో స్పైసీ ఫుడ్‌ను తీసుకుంటే మాత్రం అది జీర్ణం కావడం అంత తేలిక కాదు. ఎసిడిటీ సమస్య తలెత్తవచ్చు.

కాఫీ: రాత్రి భోజనం చేసిన అనంతరం కాఫీ తాగడం చాలామందికి అలవాటు. అయితే కాఫీలో కెఫిన్ శాతం అధిక మోతాదులో ఉంటుంది గనుక అది నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో కాఫీ తాగడం మంచిదని సూచిస్తున్నారు.

టీ: రాత్రిపూట భోజనం చేశాక కొంతమంది టీ తగుతుంటారు. కాఫీలో మాదిరిగానే టీ ఆకులలోనూ కెఫిన్ ఉంటుంది. నిద్రపోయే ముందు టీని సేవించడం వల్ల.. అది నిద్రపై ప్రభావం చూపిస్తుంది.

జంక్ ఫుడ్: జంక్ ఫుడ్‌లో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఎక్కువ. అంత త్వరగా జీర్ణం కాదు. రాత్రిపూట జంక్ ఫుడ్ తినడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. ఇది మాత్రమే దీని కారణంగా మరెన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.




