- Telugu News Photo Gallery Apple for Cholesterol: Can An Apple A Day Keep High Cholesterol Levels At Bay? Know Here
Health Tips: ఈ ఒక్క పండు నిజంగా బ్రహ్మాస్త్రమే.. రోజుకొక్కటి తింటే చాలు!
అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణం అవుతుంది. అందువల్ల ఈ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా రోజూ మెడిసిన్ తీసుకోవాలి. అలాగే వీరి రోజువారి ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి..
Updated on: Jun 13, 2024 | 2:10 PM

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణం అవుతుంది. అందువల్ల ఈ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా రోజూ మెడిసిన్ తీసుకోవాలి. అలాగే వీరి రోజువారి ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి.

కొలెస్ట్రాల్‌కు రోజు మందులతో పాటు ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్ - కొలెస్ట్రాల్ మధ్య చాలా దగ్గరి సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పండు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందట.

యాపిల్స్‌లో పెక్టిన్, పాలీఫెనాల్స్, ఫైటోస్టెరాల్స్ వంటి వివిధ సమ్మేళనాలు ఉంటాయి. యాపిల్స్‌లో కరిగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

రోజుకి రెండు మీడియం-సైజ్ యాపిల్స్ తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను 10% వరకు తగ్గించవచ్చు. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు 10% వరకు పెరుగుతాయి. యాపిల్స్‌లోని పాలీఫెనాల్స్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అథెరోస్క్లెరోసిస్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.

ప్రధానంగా యాపిల్‌లో ఉండే పాలీఫెనాల్స్, పెక్టిన్‌లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. యాపిల్స్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్స్‌లోని పీచు పదార్ధం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. కాబట్టి రోజుకొక్క యాపిల్ తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.




