AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangaladumpa Karam: అన్నంలోకి నోరూరించే బంగాళదుంప కారం.. ఇలా చేస్తే 3 రోజులు నిల్వ ఉండటం పక్కా

 ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా రోటీన్ కూరలు తిని బోర్ కొట్టినప్పుడు అందరికీ ఇష్టమైన బంగాళదుంపలతో (ఆలూ) నోటికి కారకారంగా, పుల్లపుల్లగా ఏదైనా స్పెషల్ వంటకం చేయాలనుకుంటే 'బంగాళదుంప కారం' ఒక తిరుగులేని ఎంపిక. ఇది రెగ్యులర్ బంగాళదుంప ఫ్రై లాగా కాకుండా.. అచ్చం ఆవకాయ ఊరగాయ తరహా ఘాటుతో ఉంటూ, తడి తగలకుండా ఉంచితే ఏకంగా 3 రోజుల పాటు ఏమాత్రం పాడవకుండా నిల్వ ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలకు వెళ్లేవారికి లేదా వర్కింగ్ ఉమెన్స్ కోసం ఇది ఎంతో అనువైనది.

Phani CH
|

Updated on: Nov 07, 2026 | 5:45 PM

Share
కావలసిన పదార్థాలు: అరకిలో చెక్కు తీసి బంగాళదుంపలు, ఆవాలు, అర చెంచా మెంతులు, 2 చెంచాల కారం పొడి, 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా ఉప్పు, 1½ చెంచా పచ్చి నూనె, 1 పెద్ద నిమ్మకాయ, ముక్కలు వేయించడానికి సరిపడా వంట నూనె. ఘుమఘుమలాడే చల్లని తాలింపు కోసం: 10 నుండి 12 పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు,  1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3 నుండి 4 ఎండుమిరపకాయలు, అర చెంచా ఇంగువ పొడి

1 / 5
తయారీ విధానం: స్టవ్‌పై బాండీ పెట్టి 1 చెంచా ఆవాలు, అర చెంచా మెంతులు వేయాలి. నూనె లేకుండా లో ఫ్లేమ్‌పై కలుపుతూ ఆవాలు చిటపటలాడి, మెంతులు ఎర్రగా వేగే వరకు డ్రై రోస్ట్ చేయాలి. వేగిన దినుసులను చల్లారనిచ్చి మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపలను చెక్కు తీసి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను 2 నుండి 3 నిమిషాలు ఉప్పు నీళ్లలో వేసి ఉంచాలి.

2 / 5
ఆ తర్వాత శుభ్రమైన కాటన్ క్లాత్‌పై పరిచి తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. బాండీలో నూనె వేసి వేడిచేయాలి.నూనె కాగిన తర్వాత బంగాళదుంప ముక్కలను వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు లోపలి వరకు సాఫ్ట్‌గా ఉడికేలా వేయించి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.వేయించిన బంగాళదుంప ముక్కలు ఉన్న బౌల్‌లోకి 1 చెంచా ఉప్పు, తయారుచేసిన ఆవ-మెంతుల పొడి, 2 చెంచాల కారం, 2 చెంచాల ధనియాల పొడి వేయాలి.

3 / 5
ఇందులో 1½ చెంచా పచ్చి నూనె పోసి మసాలాలు ముక్కలకు బాగా పట్టేలా స్పూన్‌తో కలపాలి. ఆ తర్వాత 1 పెద్ద నిమ్మకాయ రసం పోసి మళ్లీ సమానంగా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి మిగిలిన నూనెలో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. ఇందులో పొట్టు తీసిన 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చి శనగపప్పు కలిపిన పోపు దినుసులు, తుంచిన ఎండుమిర్చి వేయాలి.

4 / 5
చివరగా అర చెంచా ఇంగువ పొడి వేసి దోరగా వేయించి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాలింపు నూనెను గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి.తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే.. మసాలాలు పట్టిన బంగాళదుంప ముక్కల్లో పోసి గరిటెతో బాగా కలపాలి.మసాలాలు, నిమ్మరసం, తాలింపు నూనె అన్నీ కలిసి ముక్కలకు నిగనిగలాడే గుజ్జులాంటి కోటింగ్ ఏర్పడుతుంది. అంతే, నోరూరించే ఆంధ్ర స్టైల్ 'బంగాళదుంప కారం' సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి చుక్కతో ఈ కారం ముక్కలను, గుజ్జును కలుపుకుని తింటుంటే నిమ్మరసం పులుపు, కారం ఘాటు, ఆవ-మెంతుల సువాసనతో ఊరగాయ తిన్నట్లుగా ఉండి మూడు రోజుల పాటు తాజాగా అలరిస్తుంది!

5 / 5
Follow Us