ఒకవైపు తూర్పు కనుమలు, మరోవైపు సముద్రం.. ఉన్న విశాఖ నగరంలో ఎంత విస్తరించినప్పటికీ.. చాలావరకు చెట్లు, పొదలు కనిపిస్తూ ఉంటాయి. మడ అడవుల్లో కూడా విశాఖలో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ తో పాటు.. శివారు ప్రాంతాల్లో కొండలు చిన్నచిన్న అడవులు, చెట్ల పొదలు భారీగానే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉండే ఈ సర్పాలు.. కొన్ని సందర్భాల్లో జనావాసాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. బాత్రూములోనూ, ఏసీలోను, కిచెన్లోనూ, తనకు అనువైన చోట పాములు చేరి భయపెడుతూ ఉంటాయి. చిన్న చిన్న పాములైతే సరాసరి.. ఏకంగా 10 అడుగుల పొడవున్న కొండచిలువలు కూడా జనవాసంలో కనిపిస్తుండడం గుబులు పుట్టిస్తుంది. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలు, చెట్లు, పొదలు ఎక్కువగా ఉన్నచోట్ల ఇళ్లలో వచ్చి చేరుతున్నాయి ఈ పాములు.