- Telugu News Photo Gallery Andhra Pradesh and Telangana Heatwave Warning: Extreme Temperatures Expected next 3 days
బాబోయ్ ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. శనివారం, ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి.
Updated on: Mar 15, 2025 | 1:50 PM

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. ఇవాళ, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు కీలక ప్రకటన విడుదల చేశాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని.. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దిగువ ట్రోపోఆవరణములో ఆంధ్రప్రదేశ్ - యానాంలో ఆగ్నేయ, నైరుతి దిశగా దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - యానాం:- శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే ఉంది. సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు క్రమముగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- శనివారం, ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఏర్పడే ఉంది. సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు క్రమముగా 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాయలసీమ:- శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు క్రమముగా 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. శనివారం 8 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే చాన్స్ ఉంది.. ఈ మేరకు ఆదిలాబాద్, జగిత్యాల, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక.. నిన్న కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వెల్లడించింది. రెండు, మూడు రోజుల వరకు రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.





























