వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ నుండి వన్ డే ట్రిప్.. ఈ టూర్‌తో బోలెడంతా ఆరోగ్యం మీ సొంతం..!
అనంతగిరి హిల్స్.. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న అత్యంత అందమైన కొండ ప్రాంతాల్లో ఇది ఒకటి. ఈ ప్రదేశం దట్టమైన అడవులు, జలపాతాలు, కాఫీ తోటలు, పచ్చని లోయలతో నిండి ఉంటుంది. నగర జీవన హడావిడి నుండి దూరంగా, ప్రకృతి సౌందర్యంలో మునిగిపోవాలనుకునే వారికి అనువైన గమ్యస్థానం. హైదరాబాద్‌కు చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి..రోడ్డు మార్గంలో వెళితే సుమారు 2-2.5 గంటల ప్రయాణంలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఒక్క రోజులో ఈ ట్రిప్ ఎంజాయ్ చేసి రావొచ్చు.
Updated on: Jul 09, 2025 | 5:47 PM

వికారాబాద్ జిల్లాలోని ఈ అనంతగిరి కొండలు దట్టమైన అడవులు, కొండలతో నిండి ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయం నుండి కొండ శిఖరం వరకు ట్రెక్కింగ్ చేయడం ప్రతి ఒక్కరికీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. . ఈ ట్రెక్కింగ్ సమయంలో.. మీరు పురాతన గుహలు, చిన్న చిన్న జలపాతాలు, సుందరమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి.

అందమైన అనంతగిరి కొండల్లో ఆధ్యాత్మికతకు నిలయమైన పద్మనాభ ఆలయం కూడా ఉంటుంది. ఎటుచూసిన పచ్చటి ఔషధ మొక్కలు మంచి సువాసనను వెదజల్లుతుంటాయి. అందుకే సీజన్ ఏదైనా సరే.. వేలాది మంది పర్యాటకులు అనంతగిరి అందాలను చూసేందుకు ఇక్కడకు వస్తుంటారు. మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాయి.

అనంతగిరి హిల్స్‌లో చిన్న చిన్న జలపాతాలు, వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి. ఇక్కడి వచ్చే పర్యాటకులకు ఫోటోలు తీసుకునేందుకు అద్భుతమైన ప్రదేశాలు. ఇక సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ నుండి చూడటానికి అద్భుతంగా ఉంటాయి.

అనంతగిరి కొండలపై మానవాళికి ఉపయోగపడే ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. వీటి సంరక్షణకు ఫారెస్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనంతగిరికి వచ్చే దారిలో 1200 ఎకరాల విస్తీర్ణంలో ఔషధ వనాన్ని నిర్మించారు. సుమారు 30 రకాల ఔషధ మొక్కలను అక్కడ ప్రత్యేకించి నాటారు.

ఇకపోతే, అనంతగిరి హిల్స్‌కు హైదరాబాద్ నుండి NH163 రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు ఇరుపక్కలా పచ్చని పొలాలు, చిన్న గ్రామాలు, కొండల మధ్య గుండా వెళుతుంది. మీరు సొంత వాహనంలో లేదా టాక్సీ ద్వారా కూడా ఇక్కడికి ప్రయాణించవచ్చు. బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. కానీ సౌలభ్యం కోసం కారు లేదా బైక్ ఉత్తమం. అంతేకాదు.. వర్షాలు పడ్డాయి. కాబట్టి, అక్కడి వాతావరణం పూర్తిగా పచ్చగా మారి మరింత అందంగా కనిపిస్తుంటుంది..అందుకే ఇప్పుడే అనంతగిరి హిల్స్ ట్రిప్‌కి ప్లాన్ చేసుకోండి.




