AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ పండేగా అనుకుంటే పొరబడినట్లే.. ఆ సమస్యలకు చెక్ పెట్టే పవర్‌హౌస్.. దెబ్బకు మటాష్..

ఈ పండులో మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి.. బొప్పాయిలో ఫోలేట్ కూడా ఉంటుంది.. ఇది చాలా ఆరోగ్యకరమైనది. అందుకే.. దీనిని సూపర్ ఫ్రూట్ గా పేర్కొంటారు.

Shaik Madar Saheb
|

Updated on: May 30, 2025 | 1:53 PM

Share
బొప్పాయిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.. బొప్పాయిని తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.. అంతేకాకుండా.. బరువును కూడా తగ్గిస్తుంది. అందుకే.. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే బొప్పాయిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..

1 / 6
బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా ఉంటాయి.. బొప్పాయిలో ఫోలేట్ కూడా ఉంటుంది.. ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో పొటాషియం.. మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది కంటి సమస్యలను దూరం చేసి కంటిశుక్లం సమస్యను కూడా తొలగిస్తుంది. బొప్పాయిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2 / 6
బొప్పాయిలో కైమోపాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిలోని ప్రోటీన్లు పేగు ఆరోగ్యానికి సహాయపడతాయి.. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. దీనిలోని విటమిన్లు సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తాయి.. ముఖ్యంగా జలుబు లేదా దగ్గు రాకుండా ఉండటం నుంచి కాపాడతాయి.. బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో బీటా కెరోటిన్.. లైకోపీన్ ఉంటాయి. ఇది వాపు .. ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది.

3 / 6
బొప్పాయి గుండె సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ ఆరోగ్యానికి బొప్పాయి చాలా మంచిది. దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి. బొప్పాయి ఆరోగ్యకరమైన చర్మానికి కూడా మేలు చేస్తుంది.. ఇంకా మీరు బొప్పాయిని ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.

4 / 6
బొప్పాయి తినడం ద్వారా మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. కాబట్టి కడుపు నిండిన భావన ఎక్కువగా ఉంటుంది.. దీంతో అతిగా తినరు. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీని వల్ల మీరు సులభంగా బరువు తగ్గవచ్చు.

5 / 6
బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల వయసు సంబంధిత కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బొప్పాయిలోని బయోయాక్టివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు సమస్యను తగ్గిస్తాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది.

6 / 6
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!

రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?

JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!

ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు

హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..

సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత

భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు

గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి