శీతాకాలంలో జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా దాడి చేస్తాయి. ముల్లంగి ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పని చేస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సులభతరం చేస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.