- Telugu News Photo Gallery Business photos These are the top electric car launches of 2023, check details in telugu
Electric Cars: టాప్ లేపిన ఎలక్ట్రిక్ కార్లు.. 2023లో లాంచ్ అయిన బెస్ట్ ఈవీలు ఇవే..
ప్రపంచం పర్యావరణ హిత వాహనాల వైపు చూస్తోంది. ఎలక్ట్రిక్, సీఎన్జీ వంటి వేరియంట్ల నుంచి ఎక్కువ వాహనాలు రావాలని ఆశిస్తోంది. ఇదే క్రమంలో మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల అడాప్షన్ ఎక్కువ అవుతోంది. పెద్ద కంపెనీల నుంచి స్టార్టప్ ల వరకూ అన్ని తమ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. 2023 సంవత్సరం ఎలక్ట్రిక్ ఉత్పత్తుల విషయంలో గణనీయమైన వృద్ధి రేటును చూసింది. కార్లు పెద్ద ఎత్తున లాంచ్ అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పో నుంచి ఎలక్ట్రిక్ కార్ల లాంచింగ్ లు బాగా పెరిగాయి. ఈ క్రమంలో 2023లో లాంచ్ అయిన టాప్ ఐదు ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు చూద్దాం..
Madhu | Edited By: Shaik Madar Saheb
Updated on: Dec 21, 2023 | 6:40 PM

లోటస్ ఎలెట్రె.. బ్రిటీష్ కారు తయారీదారు లోటస్ అన ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఫ్లాగ్ షిప్ ఎలెట్రెతో భారతీయ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇది రూ. 2.55కోట్ల ఎక్స్ షోరూం ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ కంపెనీ రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో మన దేశంలో కార్లను అందుబాటులో ఉంచింది. ఒకటి 603బీహెచ్పీ, 710ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుండగా.. మరొకటి 905బీహెచ్పీ, 985ఎన్ఎం టార్క్ ను ఉత్పతి చేస్తుంది. వీటి రేంజ్ వరుసగా 600కిలోమీటర్లు, 490కిలోమీటర్లు ఉంటుంది.

హ్యూదాయ్ ఐయనిక్ 5.. ఈ కారును 2022లోనే హ్యూందాయ్ ఆవిష్కించింది. అయితే జనరవి 2023న అందుబాటులోకి తెచ్చింది. ఇది 2023లో మన దేశంలో లాంచ్ అయిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది మొట్టమొదటి రెట్రో క్లాసిక్ లుకింగ్ ఈవీ. ఈ కారు హ్యూందాయ్ సంస్థ 44.95లక్షల ఎక్ష్ షోరూం ధరతో అందుబాటులో ఉంది.

టాటా నెక్సాన్.ఈవీ.. 2023 సెకండ్ హాఫ్ లో ఈ కారును లాంచ్ చేశారు. ఇది టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్. ఇది టాటా ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త ఐడెంటినీ అందించింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 14.74లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

ఎంజీ కామెట్.. ఎంజీ మోటార్స్ మన దేశంలో లాంచ్ చేసిన మైక్రో ఈవీ ఇది. ఏప్రిల్ 2023లో మన దేశ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అర్బన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఇది వచ్చింది. టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 కార్లకు పోటీగా ఈ ఎంజీ కామెట్ మర్కెట్లో నిలుస్తోంది. దీని ధర రూ. 7.89లక్షలు ఎక్స్ షోరూం నుంచి ప్రారంభమవుతుంది.

సిట్రోయిన్ ఈ-సీ3.. ఫ్రెంచ్ కార్ మేకర్ అయిన సిట్రోయిన్ తన కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ తో 2023లోనే ఇండియన్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్రవరి 2023లో రూ.11.50లక్షల ఎక్స్ షోరూం ప్రారంభ ధరతో ఈ-సీ3 కారును లాంచ్ చేసింది. ఇది కంపెనీ నుంచి ఎంట్రీ లెవెల్ ఈవీగా ఉంది. సీ3 హ్యాచ్ బ్యాక్ ఆధారంగా రూపొందిన ఎలక్ట్రిక్ కారు ఇది.





























