Jaggery With Chana : బెల్లంతో కలిపి శనగలు తింటున్నారా..? అయితే, శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి..
వేయించిన శనగల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అంతేకాకుండా, బెల్లంలో జింక్, సెలీనియంలు ఎక్కువగా ఉంటాయి. వేయించిన శనగలు విటమిన్ బి6, విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, థియామిన్, రిబోఫ్లేవిన్, మాంగనీస్, ఐరన్ ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయి..బెల్లం, శనగలను కలిపినపుడు అది విటమిన్లు, ఖనిజాలతో నిండిన మంచి పౌష్టికాహారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Feb 17, 2025 | 8:59 PM

వేయించిన శెనగలు, బెల్లం రెండింటి కలిపి తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచే అమృత ఆహారంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

మీరు సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటమే కారణం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉదయం బెల్లం, వేయించిన శనగలు తింటే చాలు అంటున్నారు నిపుణులు. ఇది మీ ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి, కాలుష్య సంబంధిత వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

మీ ఎముకలు బలహీనంగా ఉంటే, వాటిని దృఢంగా చేసుకోవడానికి ప్రతిరోజూ ఉదయం బెల్లం, శనగలు తినండి. బెల్లం, శనగలు మీ జ్ఞాపకశక్తిని, మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. పెద్దలు, పిల్లలు ఉదయం వీటిని తినాలి.

మీ బరువు పెరుగుతుంటే, మీ ఆహారంలో వేయించిన శనగలు, బెల్లం చేర్చుకోండి. వీటిని కలిపి తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. బెల్లం, శనగలు తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వాటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

శ్వాసకోశ వ్యవస్థ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి బెల్లం, వేయించిన శనగలు ఈ రెండు కలిపి తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు రాత్రి కొంచెం వేయించిన శనగలు, బెల్లం పాలతో కలిపి తీసుకోవాలి. ఇలా తింటూ ఉంటే త్వరలోనే మార్పును గమనిస్తారని చెబుతున్నారు.




