- Telugu News Photo Gallery Amazing Benefits Of Eating Banana And Black Pepper On Empty Stomach For 1 Month
అరటి పండు నల్ల మిరియాలు కలిపి తింటే.. శరీరంలో జరిగేది అద్బుతమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు, నల్ల మిరియాలు కలిపి తినడం వల్ల మీ ఆరోగ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని మీకు తెలుసా? ఈ ఆయుర్వేద మిశ్రమం మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అరటిపండు, నల్ల మిరియాలు ఆయుర్వేదంలో అద్భుత సూపర్‌ఫుడ్‌లుగా పరిగణిస్తారు.. మీరు ఈ రెసిపీని ఒక నెల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే, ఐదు అద్భుతమైన ప్రయోజనాలను అందుకుంటారు. అరటిపండు, నల్లమిశ్రమంతో కలిగే లాభాలేంటో ఇక్కడ చూద్దాం..
Updated on: Sep 30, 2025 | 11:29 AM

ఖాళీ కడుపుతో అరటి పండు-మిరియాలు కలిపి తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అరటిలోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నల్ల మిరియాల్లోని పోషకాలు గ్యాస్ట్రిక్ రసాలను ప్రేరేపిస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అరటి, మిరియాలు కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.

రోజూ రెండు నల్ల మిరియాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటిని తమ ఆహారంలో చేర్చుకోవాలి. నల్ల మిరియాలు బరువు తగ్గడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు తింటే కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటిపండ్లు- మిరియాలు కలిపి తింటే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. బాడీ డీటాక్సిఫికేషన్‌లో సాయపడతాయి. అరటి పండ్లు-మిరియాలు కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మిరియాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

అరటి పండు- మిరియాలు కలిపి తీసుకుంటే బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఖాళీ కడుపుతో ఈ రెండిటీని కలిపి తీసుకుంటే ఊబకాయం సమస్య ఉండదు. అరటి-మిరియాలు కలిపి తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటి తింటే సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండొచ్చు.

అరటి పండు- మిరియాలు కలిపి తీసుకుంటే బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది. ఖాళీ కడుపుతో ఈ రెండిటీని కలిపి తీసుకుంటే ఊబకాయం సమస్య ఉండదు. అరటి-మిరియాలు కలిపి తీసుకుంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అరటి తింటే సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండొచ్చు.




