- Telugu News Photo Gallery Advantages and disadvantages of eating rice at night, Harm to health by eating rice at night
Rice: రాత్రిపూట అన్నం తింటే ఆరోగ్యం పాడవుతుందా..? వాస్తవం ఏమిటంటే..
Rice Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినన్ని పోషకాలు లభించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం.. అయితే, బియ్యంలో కూడా చాలా పోషకాలు దాగున్నాయి. అన్నం వండటం పెద్ద కష్టమైన పని కాదు.. సులభంగా తయారు చేయవచ్చు.
Updated on: Jul 08, 2023 | 10:14 PM

Rice Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినన్ని పోషకాలు లభించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం.. అయితే, బియ్యంలో కూడా చాలా పోషకాలు దాగున్నాయి. అన్నం చేయడం పెద్ద కష్టమైన పని కాదు.. సులభంగా తయారు చేయవచ్చు. చాలా మంది అన్నం తినడాన్నే ఇష్టపడతారు. అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనితో పాటు ఇందులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం కూడా ఉంటాయి. అయితే, చాలా మందిలో రాత్రిపూట అన్నం తినాలా వద్దా అనే ప్రశ్న తరచూ తలెత్తుతుంటుంది. అన్నం తినండం వల్ల ప్రయోజనాలతో పాటు.. ప్రతికూలతలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

కార్బోహైడ్రేట్లు: బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని, బలాన్ని అందిస్తుంది. ఈ విధంగా చూస్తే, కార్బోహైడ్రేట్లు శరీరానికి అందించే పనిని సకాలంలో చేస్తాయి. దీని కారణంగా మనం మన పనిని సులభంగా చేయగలుగుతాము.

కడుపుకు మేలు చేస్తుంది: అన్నం కడుపుకు చాలా మేలు చేస్తుంది. ఉడకబెట్టిన అన్నం సులభంగా జీర్ణమవుతుంది. దీనితో పాటు, కడుపు నొప్పి, అజీర్ణం సమస్యలను దూరం చేసుకోవచ్చు. మలబద్దకం లాంటి సమస్య కూడా నయమవుతుందని.. పేర్కొంటున్నారు.

జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: అన్నం జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుందంటున్నారు నిపుణులు.. దీని వల్ల శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు చేరుతాయి. అన్నం బలహీనమైన జీర్ణవ్యవస్థను కూడా నయం చేస్తుంది. దీనితో పాటు, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.

రాత్రి వేళ అన్నం తింటే మంచిదేనా: అన్నింటికీ ప్రయోజనాలు ఉన్నట్లే.. ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను మీరు ఇప్పటికే తెలుసుకుని ఉంటారు. అయితే, రాత్రిపూట ఎక్కువ అన్నం తినడం కూడా హాని కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడంతోపాటు.. పలు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.





























