peanuts: ఇదేదో టైమ్‌పాస్ స్నాక్ అనుకుంటే పొరపడినట్టే.. రోజు గుప్పెడు చాలు.. శరీరంలో చెప్పలేని మార్పులు..!
పల్లీల, శనగలు, బఠాణీలు వంటివి కేవలం టైం పాస్ కోసం మాత్రమే కాదు.. వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్నీ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశనగల్లో సహజ సిద్ధంగా ఉండే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ B, విటమిన్ E వంటివి హెల్తీగా ఉంచుతాయంటున్న పోషకాహర నిపుణులు. పల్లీలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..
Updated on: Oct 03, 2024 | 1:55 PM

వేరుశనగలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక గుడ్డులో ఉండే ప్రోటీన్ అందులో ఉంటాయి. ఒక గ్లాసు పాలలో ఉండే పోషకాలు ఉంటాయి. పల్లీల్లో మోనో ఇన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నాశనం చేస్తుంది. వేరుశనగల్లో ఎన్నో విటమిన్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

పల్లీలు తినటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో విటమిన్ బీ కాంప్లెక్స్, నియాచిన్, రిబోఫ్లోవిన్, థియామిన్, విటమిన్ బీ6, పెంటోథెనిక్ యాసిడ్ ఉంటాయి. ముఖ్యంగా చలికాలం వేరుశనగలు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. జలుబు, దగ్గు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు తొలగుతాయి.

రోజూ గుప్పెడు వేరుశనగలు తినటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బాదాంలో ఉండే పోషకాలు ఇందులో ఉంటాయి. శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. పల్లీల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. రోజూ 30 నుంచి 40 గ్రాముల పల్లీలు తింటే సరిపోతుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది. ఆకలిని పోగొట్టి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.

వేరుశనగలో ఉండే ఆరోగ్యకర కొవ్వులతో పాటు మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, కాపర్, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పల్లీల లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగిఉండటంతో మధుమేహ రోగులూ నిరభ్యంతరంగా వీటిని తీసుకోవచ్చు. పల్లీల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. తీవ్ర వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

ఇక బెల్లంతో చేసే ఈ పల్లీ పట్టిలో ఐరన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఆరోగ్యకర కొవ్వులు, జింక్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పల్లీ పట్టీలు తీసుకోవడం ద్వారా మంచి పోషకాలు శరీరానికి అంది ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. ముఖ్యంగా పల్లీ పట్టీలో ఉండే బెల్లం బాడీకి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. వీటితో పాటు మీ డైట్లో సమతులాహారం ఉండేలా చూసుకోవాలి.




