Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ఒకే నెలలో క్రికెట్‌లోని పలు ఫార్మాట్లకు ఆరుగురు ఆటగాళ్ల రిటైర్మెంట్!

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌తో మొదలైన స్టార్ ఆటగాళ్ల వీడ్కోలు ఒకే నెలలో ఆగురురికి చేరింది. మే నుంచి జూన్ నెల మధ్యలో మొత్తం ఆరుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోని పలు ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వారిలో కొందరు కొన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికగా, మరికొందరు అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. ఈ విధంగా, గత నెలలో రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా నుంచి ఇద్దరు క్రికెటర్లు ఉండగా.. నలుగు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

Anand T

|

Updated on: Jun 11, 2025 | 5:35 PM

మొట్టమెదటగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాడు భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ గత మే 7న టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ ఇకపై వన్డే క్రికెట్‌లో మాత్రమే టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

1 / 6
రోహిత్ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించిన వారం వ్యవధిలోనే  మరో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాను టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు మే 12న సోషల్ మీడియా ద్వారా విరాట్‌ కోహ్లీ తెలిపారు. అయితే టీ20 ప్రపంచకప్‌ తర్వాత షార్ట్-ఫామ్ క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన కింగ్ కోహ్లీ ఇకపై వన్డే క్రికెట్‌లో మాత్రమే ఆడనున్నాడు.

2 / 6

కోహ్లీ తర్వాత మరో విదేశీ ఆటగాడు శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల మాథ్యూస్ వన్డే, టీ20 క్రికెట్‌లో కొనసాగాలని ఆసక్తిగా ఉన్నప్పటికీ, వయసు రీత్యా రాబోయే రోజుల్లో అతనికి అవకాశం లభించే అవకాశం లేదు.

3 / 6

ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్, ఆస్ట్రేలియా జట్టులో కీలకంగా ఉన్న ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ కూడా తాజాగా వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే, వన్డే ఫార్మట్‌కు గుడ్‌బై చెప్పిన మ్యాక్స్‌వెల్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని చెప్పాడు.

4 / 6

కాటేరమ్మ కొడుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హెన్రిక్ క్లాసెన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తన కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయం తీసుకున్న క్లాసిన్ క్రికెట్‌లోని అన్ని ఫార్మట్‌లకు వీడ్కోలు పలికారు. కాగా 33 ఏళ్ల క్లాసెన్ రాబోయే రోజుల్లో టీ20 లీగ్‌ల మ్యాచ్‌లలో మాత్రమే ఆడనున్నారు.

5 / 6
వెస్టిండీస్ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ నికోలస్ పూరన్ కూడా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఇందరులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే కేవలం 29 ఏళ్ల వయస్సులోనే పురాన్ అన్ని  అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం. అయితే, పూరన్ ఇకపై T20 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు.

6 / 6
Follow us