- Telugu News Photo Gallery 5 Fruits to Avoid in Winter: Why Watermelon and Coconut Water Can Harm You, Check Details
Health Tips: చలికాలంలో ఈ 5 పండ్లు తిన్నారో మీ బాడీ షెడ్డుకే.. లైట్ తీసుకుంటే..
చలికాలం అంటే రుచికరమైన, పోషకాలు నిండిన పండ్లకు సీజన్. అయితే కొన్ని పండ్లు సీజన్‌కు తగ్గట్టుగా లేకపోతే అవి మన ఆరోగ్యానికి మేలు చేసే బదులు జీర్ణ సమస్యలు లేదా జలుబు వంటి ఇబ్బందులను కలిగిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో పండ్లను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో ఏయే పండ్లు తినకూడదు, వాటి వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Updated on: Oct 17, 2025 | 7:00 PM

దోసకాయ - పుచ్చకాయ: వేసవికాలంలో ఈ రెండు పండ్లు శరీరాన్ని చల్లగా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తాయి. కానీ చల్లని వాతావరణంలో వాటిని తినడం వల్ల ఇబ్బందులు వస్తాయి. వీటిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో చల్లదనం మరింత పెరుగుతుంది. ఇది దగ్గు, జలుబు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల సాధారణంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది. అయితే జలుబు, ఫ్లూతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగకుండా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు కూడా వారానికి ఒకసారి మాత్రమే తాగాలి.

ద్రాక్ష శరీరాన్ని చల్లబరుస్తుంది. తరచుగా దగ్గు, జలుబుకు కారణమవుతుంది. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి, శీతాకాలంలో వీటిని అధికంగా తీసుకోవడం హానికరం.

Strawberry

అవకాడో: అవకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం. అయినప్పటికీ వీటిని తినే విషయంలో శీతాకాలంలో కొంత జాగ్రత్త అవసరం. అవకాడోలో ఉండే హిస్టామిన్ కంటెంట్ కొంతమందిలో అలెర్జీ, దగ్గు సమస్యలను పెంచవచ్చు. ఇది ఛాతీ పట్టేయడం, ఇన్‌ఫెక్షన్లకు కూడా దారితీయవచ్చు. అందుకే చలికాలంలో వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.




