UP Polls 2022: యూపీ ఎన్నికల్లో ప్రతి దశలో మారుతున్న ప్రచారాస్త్రాలు.. తాజా అస్త్రం ఏంటో తెలుసా?

ఏడు దశల్లో జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Elections 2022).. ఒక్కొక్క దశ ముగిసేకొద్దీ ఎన్నికల ప్రచారాస్త్రాలు మారుతున్నాయి. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) సంధిస్తున్న ఆరోపణాస్త్రాలు ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

UP Polls 2022: యూపీ ఎన్నికల్లో ప్రతి దశలో మారుతున్న ప్రచారాస్త్రాలు.. తాజా అస్త్రం ఏంటో తెలుసా?
Up Elections
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 22, 2022 | 5:21 PM

ఏడు దశల్లో జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(UP Elections 2022).. ఒక్కొక్క దశ ముగిసేకొద్దీ ఎన్నికల ప్రచారాస్త్రాలు మారుతున్నాయి. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) సంధిస్తున్న ఆరోపణాస్త్రాలు ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందివచ్చిన అన్ని అవకాశాలనూ కాషాయ దళపతులు వినియోగించుకుంటున్నారు. తొలుత ‘గూండా రాజ్’ అంటూ సమాజ్‌వాదీ పార్టీని నిందించిన కమళనాథులు.. తాజాగా 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు తీర్పును ఒక అస్త్రంగా మలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన బీజేపీ ప్రచార ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ.. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి పేలుళ్లలో బాంబులు పెట్టేందుకు ఉగ్రవాదులు సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’ను ఎందుకు ఎంచుకున్నారని తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ సర్కారు, కొంతమంది ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకోవాలని కోరిందని ఆరోపించారు. 2006లో ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు యూపీలోని సంకట్మోచన్ ఆలయం, వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుళ్లను కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2013లో సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘హర్కత్-ఉల్-జిహాదీ’ (HuJi) సభ్యుడు షమీమ్‌ అహ్మద్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. అలాగే 2007లో గోరఖ్‌పూర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఆరోపణలు ఎదుర్కొన్న మరో వ్యక్తి తారిఖ్ ఖాస్మీపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిందని ప్రధాని అన్నారు. అయితే న్యాయస్థానం ఇందుకు అంగీకరించలేదని, దోషులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిందని గుర్తుచేశారు.

‘‘భారతీయులను నాశనం చేయాలనుకున్న వాళ్లకు కోర్టు శిక్ష విధించింది. ఉగ్రవాద దాడి జరిగినప్పుడు, ఉగ్రవాదం పెరిగినప్పుడు అత్యధికంగా నష్టపోయేది పేద, మధ్యతరగతి ప్రజలే అని మీకందరికీ తెలుసు. ఉగ్రదాడి తర్వాత వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయి” అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేవలం మోదీయే కాదు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్, ఇతర బీజేపీ నేతలు సైతం ఇవే ఆరోపణలు చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల దోషుల్లో ఒకరి తండ్రి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో కలిసి కనిపించిన ఫోటోను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రదర్శించారు.

ఉగ్రవాదం – సందర్భానికి తగ్గ అస్త్రం

ఉగ్రవాదాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారాంశంగా మార్చడంలో బీజేపీ నేతలు సమయానుకూలంగా వ్యవహరించారు. మైనారిటీ ఓటుబ్యాంకు రాజకీయాలతో ఉగ్రవాదంపై మెతకగా వ్యవహరించిందంటూ గతంలో కాంగ్రెస్ పార్టీపై ప్రయోగించిన అస్త్రాన్ని ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీపై ఎక్కుపెట్టారు. 2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసు నిందితుల కుటుంబ సభ్యులు అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఓట్లు అడిగారని ఆరోపిస్తూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్‌ వంటి ఉగ్రవాదిని ఒసామా‘జీ’ అని సంబోధించారని, బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులను హతమార్చడంపై కూడా కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసిందని, భారత సైన్యాన్ని, పోలీసులను అవమానించిందని మోదీ ఆరోపించారు. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలను పునాదిగా చేసుకున్నంతకాలం కాంగ్రెస్ పార్టీపై ఈ తరహా ఆరోపణలు చేస్తూ వచ్చిన బీజేపీ నేతలు, ఇప్పుడు ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీ ఓటుబ్యాంకుగా మారడంతో మరింత పదునైన విమర్శలకు తెరలేపారు.

ఉగ్రవాదం అనే అంశాన్ని ప్రత్యర్థులపై సంధించే అస్త్రంగా చేసుకుంటున్నది కేవలం బీజేపీ మాత్రమే కాదు. తాజాగా జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఈ తరహా ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ ఖలిస్తానీ వేర్పాటువాదులతో కుమ్మక్కయ్యారని హిందీ కవి కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మలచుకుంది.

ముంబై మారణహోమం నుంచి మారిన సీన్

26/11 దాడులుగా చరిత్ర పుస్తకాల్లో నిక్షిప్తమైన ముంబై మారణహోమం దేశ ప్రజల ఆలోచనాసరళిలో మార్పు తీసుకొచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మీద, దేశంలో ఉగ్రవాద శక్తులకు ఆశ్రయం కల్పిస్తున్న కొన్ని వర్గాలపై కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న అభిప్రాయం సామాన్యుల్లో కలిగింది. ముస్లిం బుజ్జగింపు రాజకీయాల కారణంగానే దేశంలో ఉగ్రవాదం పెరిగిందన్న భావనతో మధ్యతరగతి వర్గం నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలను ప్రదర్శించింది. ఈ ఆగ్రహ జ్వాలలను కాస్త ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్, 2014 ఎన్నికలకు ముందు ముంబై మారణహోమంలో ప్రాణాలతో దొరికిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను, పార్లమెంట్‌పై దాడిలో కుట్రదారుడైన అఫ్జల్ గురును ఉరి తీయడంతో సద్దుమణుగుతాయని భావించింది. కానీ అప్పటికే కార్చిచ్చులా వ్యాపించిన ఈ జ్వాలలు 2014 ఎన్నికల్లో ఆ పార్టీని దాదాపుగా దహించాయి. ఉగ్రవాదాన్ని, మతాన్ని కలిపుతూ రాజకీయం చేయడంలో ఆరితేరిన బీజేపీ, 2014లో అధికారం చేపట్టిన తర్వాత దేశం వెలుపల, దేశం లోపల ఉగ్రవాదంపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులతో సీమాంతర ఉగ్రవాదం, దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పే ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ సమాజం ముందు వీలుచిక్కినప్పుడల్లా పాకిస్తాన్‌ను దోషిగా నిలబెడుతోంది.

మరోవైపు యూపీఏ హయాంలో దేశంలోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో జరిగిన బాంబు పేలుళ్లు, ఉగ్ర దాడి ఘటనలతో ప్రజల్లో ఏర్పడ్డ అభద్రతాభావం మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగ్గింది. వేర్పాటువాదంతో ముడిపడ్డ ఉగ్రవాదం వేళ్లూనుకున్న కాశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఒకట్రెండు ఘటనలు మినహా దేశంలోని ప్రధాన భూభాగంలో ఉగ్రవాద చర్యలను కట్టడి చేయడంలో మోదీ సర్కారు విజయం సాధించిందనే అభిప్రాయం నెలకొంది. నిజానికి శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినప్పటికీ, జాతీయ – అంతర్జాతీయ స్థాయిలో మోదీ సర్కారు అనుసరిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక ధోరణి, వారికి ఆ ఘనతను తెచ్చిపెట్టింది. అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఉగ్రవాద సానుభూతిపరులు అంటూ చేసే ఆరోపణల విషయంలో ఆ పార్టీ చులకనవుతోంది. నిజంగా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారనే ప్రశ్న సామాన్యుడిలో మెదులుతోంది. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు, ముస్లిం అనుకూల విధానాలు ప్రదర్శించే పార్టీలపై ఉగ్రవాదం పేరుతో బురదజల్లుతోంది తప్ప మరేమీ లేదన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రయోగిస్తున్న ఉగ్రవాద ఆరోపణాస్త్రం యూపీలో మిగతా 4 దశల్లో బీజేపీకి ఎంతమేర లాభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

యూపీ ఎన్నికలు..

మొత్తం ఏడు విడతల్లో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాలుగో విడత పోలింగ్ బుధవారం (ఫిబ్రవరి 23న) నిర్వహించనుండగా.. ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత(చివరి) పోలింగ్ నిర్వహించనున్నారు.

పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపున మార్చి 10న చేపట్టనున్నారు.

Also Read..

హస్తినలో మళ్లీ చక్రం తిప్పేది తెలుగువారేనా..? కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

7th Pay Commission: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. హెలీకి ప్రత్యేక ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ కింద రూ. 10,000..!

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!