Abhinandan Varthaman : శత్రుదేశం చెరలో ఉన్నా ధైర్యం, మనో స్థైర్యంతో భారత్, పాక్ ప్రజల మనసు దోచిన అభినందన్ వర్థమాన్

|

Jun 21, 2021 | 7:27 AM

పాక్ సైన్యానికి యుద్ధ ఖైదీగా దొరికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగొచ్చిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ పుట్టినరోజు ఇవాళ..

Abhinandan Varthaman : శత్రుదేశం చెరలో ఉన్నా ధైర్యం, మనో స్థైర్యంతో భారత్, పాక్ ప్రజల మనసు దోచిన అభినందన్ వర్థమాన్
Abhinandan Varthaman
Follow us on

Indian Air Force officer Abhinandan Varthaman : పాక్ సైన్యానికి యుద్ధ ఖైదీగా దొరికి సురక్షితంగా ప్రాణాలతో తిరిగొచ్చిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్ పుట్టినరోజు ఇవాళ(జూన్ 21). ఇంటర్నేషనల్ యోగా డే, అభినందన్ బర్త్ డే రెండూ ఈ ఇవాళే కావడం విశేషం. శత్రుదేశం చెరలో ఉన్నా అభినందన్ ధైర్యాన్ని, మనో స్థైర్యాన్ని యావత్‌ భారత ప్రజలే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా ప్రశంసించిన సంగతి తెలిసిందే. వింగ్ కమాడర్ అభినందన్ వర్థమాన్ భారతీయ ఎయిర్ ఫోర్స్ అధికారి. MiG-21 బైసన్ యుద్ద విమాన పైలట్.

2019 పిబ్రవరి 26 న పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగం లోకి చొచ్చుకు వచ్చింది. నౌషెరా సెక్టార్ బేస్ క్యాంప్ నుంచి అభినందన్ మిగ్ 21 యుద్ధ విమానంతో శతృవుల ఎయిర్ క్రాఫ్ట్ లను ఎదరించారు. ఎఫ్-16 భూమికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున ఉండగా.. అభినందన్ తన మిగ్ 21 యుద్ధ విమానాన్ని 15 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాక్ ఎయిర్ క్రాప్ట్ ను టార్గెట్ గా చేసుకుని కాల్పులు జరిపారు. దీనితో అది తిరుగుముఖం పట్టింది.

అయినప్పటికీ, అభినందన్ దాన్ని వదల్లేదు. వెంటాడారు. ఈ వైమానిక పోరాటంలో అభినందన్ విమానం పాకిస్తానీ భూభాగంలోకి వెళ్ళగా, పాకిస్తానీ వైమానిక దళం దీన్ని కూల్చివేసింది. దీంతో అభినందన్ ప్యారాషూట్ సహాయంతో పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని భీంబర్ జిల్లా హోరాన్ గ్రామం భూభాగంలో ప్యారాషూట్ సహాయంతో పాక్ గడ్డపై దిగారు అభినందన్.

కానీ అక్కడకు చేరుకున్న స్థానిక ప్రజలు ఆయనను చుట్టుముట్టు ముట్టడం.. తర్వాత వర్థమాన్ ను పాక్ సైన్యం తమ అధీనంలోకి తీసుకోవడం, ఆపై భారత్ దౌత్యం, ఆ తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య దాయాది దేశం పాకిస్తాన్ అభినందన్ ను భారత్ కు అప్పగించడం జరిగాయి. కాగా, అభినందన్ 1983 జూన్ 21న తమిళనాడులో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్ కు జన్మించాడు.

Read also :  KCR : ఎన్టీఆర్ లో నచ్చిందదే.. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతోంది : కేసీఆర్