AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International yoga Day….న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేలమందితో రోజంతా యోగా…

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద అమెరికా కాలమానం ప్రకారం నిన్న జరిగిన యోగా సెలబ్రేషన్స్ లో 3 వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా అభివర్ణించారు.

International yoga Day....న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద  మూడు వేలమందితో  రోజంతా యోగా...
Times Square Celebrates Yoga Day
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 21, 2021 | 11:07 AM

Share

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద అమెరికా కాలమానం ప్రకారం నిన్న జరిగిన యోగా సెలబ్రేషన్స్ లో 3 వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా అభివర్ణించారు.,తమ తమ యోగా మ్యాట్స్ తెచ్చుకుని వీరంతా ఇందులో పార్టిసిపేట్ చేయడం అభినందనీయమని భారత కాన్సులేట్ జనరల్ (దౌత్య ప్రతినిధి) రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందని, ఇండియాలో పుట్టిన యోగా గ్లోబల్ హెరిటేజ్ గా మారిందని ఆయన అన్నారు. ఇది ఆరోగ్యానికి, సంక్షేమానికి..ప్రకృతితో మమేకమై జీవించడానికి తోడ్పడుతుందన్నారు. శాంతియుత సమాజం కోసం, పచ్చని భూతలం కోసం ఇది దోహదపడుతుందని, మానవాళి ఆరోగ్యం దీనిపై ఆధార[పడి ఉందని ఆయన చెప్పారు. యోగా ఈజ్ వే ఆఫ్ లైఫ్ అన్నారు. శరీరానికి, మనసుకు సాంత్వన కలిగించే యోగాను అందరూ పాటించాలని జైస్వాల్ సూచించారు.

ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తున్న వేలమంది ఈ పరిసరాలను ‘పునీతం’ చేశారని..అద్భుత అనుభవం పొందారని ఈ ఈవెంట్ లో పాల్గొన్న రుచికా లాల్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరపు గ్లోబల్ థీమ్ ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రవచించిన యోగా ఫర్ వెల్ నెస్ నినాదం నేపథ్యంలో…ట్రైబ్స్ ఇండియాతో బాటు పలు భారతీయ కంపెనీలు ఏర్పాటు చేసిన ఆయుర్వేద, ప్రకృతి సహజ సిద్ధమైన వస్తువులు, ఉత్పత్తుల స్టాల్స్ ను అనేకమంది సందర్శించారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఇక్కడ 9 యోగా సెషన్స్ నిర్వహించారు. అలాగే న్యూజెర్సీ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.ప్రముఖ యోగా నిపుణులు ధారా నటాలీతో బాటు వివిధ భారతీయ సంఘాలు దీన్ని నిర్వహించడం విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: Vishal’s movie shooting Video: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.వైరల్ వీడియో.

 Harish Rao Met With Road Accident Video: హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం పలువురికి గాయాలు..మంత్రి వాహనానికి అడవి పంది అడ్డు.

 Telangana : స్కూల్ రీఓపెన్ కి గ్రీన్ సిగ్నల్, పేరెంట్స్ లో థర్డ్ వేవ్ టెన్షన్.. HSPA అభిప్రాయం వెల్లడి.

Guntur : ఆకతాయిలు హల్ చల్, పెట్రోల్ బ్యాంకు సిబ్బందిపై దాడి..సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిన వీడియో.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!