Himalayas: భారతదేశాన్ని భయపెడుతున్న హిమాలయాలు.. అర లక్షకు పైగా గ్లేసియర్లతో ముప్పు!

హిమాలయాలు. లక్షల ఏళ్ల క్రితం మొదలైన ఒక మహా నిర్మాణం. ఈ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ నిర్మాణం జరుగుతోంది కాబట్టే ఏడాదికో సెంటీమీటర్ పెరుగుతూ పోతోంది. దీంతో పాటే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హిమాలయాలు పెరుగుతుంటే ప్రమాదం లేదు గానీ..

Himalayas: భారతదేశాన్ని భయపెడుతున్న హిమాలయాలు.. అర లక్షకు పైగా గ్లేసియర్లతో ముప్పు!
Himalayas
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Jul 03, 2024 | 10:51 AM

హిమాలయాలు. లక్షల ఏళ్ల క్రితం మొదలైన ఒక మహా నిర్మాణం. ఈ నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ నిర్మాణం జరుగుతోంది కాబట్టే ఏడాదికో సెంటీమీటర్ పెరుగుతూ పోతోంది. దీంతో పాటే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హిమాలయాలు పెరుగుతుంటే ప్రమాదం లేదు గానీ.. అక్కడున్న మంచు కరిగితేనే యమ డేంజర్. ఆ ప్రమాదం వెనకున్న ముప్పును అంచనా వేయడం కూడా కష్టమే.

2100 నాటికి హిమాలయాలపై 75 శాతం మంచు కరిగిపోతుందని అంచనా

Himalayas 1

Himalayas 1

మరో 75 ఏళ్లలో.. అంటే 2100 సంవత్సరం నాటికి హిమాలయాలపై ఉన్న మంచు 75 శాతం కరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. భారీ జల ప్రళయమే వస్తుంది. ఆ మంచు కాస్తా పూర్తిగా కరిగిపోతే.. అప్పుడిక జలప్రళయాలు కాదు.. నదులే ఉనికి కోల్పోతాయి. గంగ, యమున, బ్రహ్మపుత్ర, సింధు నదులు భారతదేశంలోని 40 శాతం మందికి నీటిని అందిస్తున్నాయి. ఈ నదుల నీరే.. తాగునీటి అవసరాలకు, పంటలు పండించడానికి, పరిశ్రమలకు ఉపయోగపడుతున్నాయి. సో, హిమాలయాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ఉత్తర భారతదేశమే ఉండదు. అంతకంటే ముందు మరో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మంచు కరుగుతున్న కారణంగా సముద్రమట్టాలు కూడా పెరుగుతాయి. ఇవి దేశంలోని తీరప్రాంతాలను సముద్రంలో కలిపేసుకునే ప్రమాదముంది.

2000 – 2020 మధ్య కరిగిపోయిన మంచు దాదాపు 2 లక్షల కోట్ల కిలోలు!

Himalayas 2Himalayas 2

హిమాలయాలు కరుగుతున్నాయంటే.. మిగిలిన చోట్ల కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో, దీవులు మునిగిపోతాయి. ఆ తరువాత తీరప్రాంతాలన్నీ శాశ్వతంగా జలసమాధి అవుతాయి. ఇప్పటికే, హిమాలయాల్లో సరస్సులు పెరుగుతున్నాయి. ఎక్కడైనా సరస్సులు పెరిగితే సంతోషిస్తారు. కాని, అదే పని హిమాలయాల్లో జరిగితే మాత్రం భయపడతారు. అవన్నీ కట్టలు తెంచుకుని విరుచుకుపడేది జనావాసాలపైనే. 2000 నుంచి 2020 మధ్య 1.7 గిగా టన్నుల మంచు కరిగిపోయిందని లెక్కవేశారు. అంటే అటుఇటుగా రెండు లక్షల కోట్ల కిలోల మంచు.

హిమాలయాల్లోని మంచు కరిగిపోతే.. అక్కడ జీవవైవిధ్యం దెబ్బ తింటుంది. అక్కడి వాతావరణం కారణంగా ఎంతో విలువైన ఆయుర్వేద మూలికలు పెరుగుతున్నాయి. అవన్నీ మాయం అవుతాయి. చలి ప్రాంతంలో జీవించే జంతువులన్నీ అలాంటి ప్రాంతం కోసం వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో అంతరించిపోతాయి కూడా.

సాధారణంగా హిమాలయాల వంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కశాతం పెరగడమే ప్రమాదం. వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది. అలాంటిది రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. దీనికి కారణం ఆధ్యాత్మికత పేరుతో పెరుగుతున్న పర్యాటకం. అక్కడికి వెళ్లే వారికి సౌకర్యాలు కావాల్సి వచ్చింది. రోడ్లు, సొరంగాలు, బిల్డింగులు, బ్రిడ్జిలు ఎడాపెడా కట్టేశారు. నిర్మాణాలకు, నిర్వహణకు కరెంట్ కావాల్సి వచ్చింది. అంతే, అక్కడే భారీ జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించారు. ఎక్కడైనా సరే.. నిర్మాణాలు జరిగితే ఆటోమేటిక్‌గా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనికితోడు అక్కడి వాతావరణం కాలుష్యమయం అవుతోంది. అక్కడ పడేసే చెత్త అంతాఇంతా కాదు. అమర్‌నాథ్ యాత్ర జరిగితే.. ఆ ఏడాది కనీసం వెయ్యి టన్నుల చెత్త తయారవుతోంది. భక్తులే ఇలా ఉంటే పర్యాటకులు ఇంకెలా ఉంటారు. అందుకే ఎవరెస్ట్‌కు మరో పేరు ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన చెత్త డబ్బా అని పిలుస్తారు. అక్కడ ఆ లెవెల్‌లో చెత్త వేస్తున్నారు పర్యాటకులు. హిమాలయాల్లో మనిషి చేస్తున్న ప్రతి పనీ కాలుష్యకారకమే. హిమాలయాల్లోని మంచు కరగడానికి అదీ కారణమే. హిమాలయాలు చాలా పెలుసుగా ఉంటాయి. అంత గట్టివి కావు. పైగా మైదాన ప్రాంతాలు చాలా తక్కువ. సరిగ్గా అలాంటి చోట.. ఆ ప్లేస్ తట్టుకునే శక్తికి మించి నిర్మాణాలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి.

హిమాలయాల్లో చిన్నవి పెద్దవి కలిపి కనీసం 55,000 గ్లేసియర్స్ ఉన్నాయి

Himalayas 3

Himalayas 3

హిమాలయాల్లో చిన్నవి పెద్దవి కలిపి కనీసం 55వేల గ్లేసియర్స్ ఉన్నాయి. అంటే మంచు ఫలకాలు. ఇవి కరగడం మొదలుపెడితే ఒక్కసారిగా నీరు ముంచెత్తి, ఊళ్లు, నగరాలను తుడిచిపెట్టేస్తాయి. ఉత్తరాఖండ్ వైపు కనీసం 500కు పైగా గ్లేసియర్స్ ఉన్నాయి. ఇవి కరిగి, నీరుగా మారి, భారీ రిజర్వాయర్స్ స్థాయిలో ఏర్పడతాయి. ఆ సమయంలో చిన్న కుదుపు చాలు.. ఆ నీరంతా ఊళ్లను ముంచెత్తడానికి. ఉత్తరాఖండ్‌లోని చమోలీలో జలప్రళయం రావడానికి కారణం ఇలా మంచు కరగడమే. ఇలా కరిగిన మంచు అంతా ధౌలిగంగ నదిలో చేరింది. ఈ నది నీటిమట్టం పెరిగి ఒక జలప్రళయాన్నే సృష్టించింది. దాని కారణంగా రుషిగంగ అనే డ్యామ్ కట్టలు తెంచుకుంది. అక్కడి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సైతం కొట్టుకుపోయింది. అందులో పనిచేస్తున్న 170 మంది గల్లంతు అయ్యారు. రైనీ అనే గ్రామం నీట మునిగింది. పాకిస్తాన్‌లో కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు రావడానికి కూడా హిమాలయాల్లోని హిమానీనదాలు కరగడమే. అప్పట్లో కనీసం 20 డ్యాముల పైనుంచి నీరు ప్రవహించింది. చిన్న గ్లేసియర్స్ కరిగితేనే ఇంత ప్రమాదం జరిగితే.. హిందూకుష్ ప్రాంతంలో ఏకంగా 54 వేల గ్లేసియర్లు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. అవన్నీ కరిగితే.. జరగబోయే ప్రళయం ఊహకైనా అందుతుందా? అసలు ఆ ప్రమాదం దిశగా ఎవరైనా ఆలోచించారా?

2006లో 5,200 మీటర్లకు వెళ్తే గానీ కనపడని మంచు

Himalayas 4

Himalayas 4

ఒకప్పుడు హిమాలయాల్లో చాలా తక్కువ ఎత్తులోనే మంచు కనిపించేది. 1976లో హిమాలయాలకు వెళ్లినప్పుడు.. 4వేల 900 మీటర్ల ఎత్తు చేరే సరికే మంచు రేఖ కనిపించేది. 2006లో వెళ్లినప్పుడు 5వేల 200 మీటర్లకు వెళ్తే గానీ మంచు కనిపించలేదు. అంటే, మంచు 300 మీటర్లు తగ్గిపోయినట్టే కదా. మంచు కరిగితే ఏమవుతుందిలే అని అనుకుంటాం గానీ.. ఈమధ్య లాజ్ఏంజెల్స్ నగరం ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్ద మంచు ఫలక కరిగిపోయిందట అంటార్కిటికా ధ్రువ ప్రాంతంలో. ఆ నీరంతా ఏమైపోతుంది? చివరికి సముద్రంలోనే కలుస్తుంది. అంటే సముద్రమట్టం పెరుగుతుంది. దీనివల్ల తీర ప్రాంతాలకు ముప్పు తప్పదు.

2100 నాటికి జీవ నదులు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం!

Himalayas 5

Himalayas 5

హిమాలయాల్లో గంగోత్రి అనేది కూడా ఒక గ్లేసియరే. ఇది ఎంత పెద్దది అంటే.. ఈ గంగోత్రి అనే గ్లేసియర్ నుంచే గంగానది, యమునోత్రి అనే ప్రాంతంలో యమునా నది, ఇక్కడ ఉండే సరస్సు నుంచి సట్లేజ్ నది పుట్టుకొచ్చాయి. సో, గంగోత్రి గ్లేసియర్ అంత పెద్దది. జీలం నది, బ్రహ్మపుత్ర నది, సింధు కూడా ఇలాంటి గ్లేసియర్స్ కారణంగా పుట్టినవే. రేప్పొద్దు ఈ గ్లేసియర్స్ కరిగిపోయాయంటే అర్థం.. గంగ, యమున, సట్లేజ్ నదులు కనుమరుగవుతాయనే కదా. హిమానీనదాలు కరిగిపోతే ముందుగా జరిగేది జలప్రళయం. ఆ తరువాత వచ్చేది కరువు. గ్లేసియర్సే లేకపోతే, వాటి నుంచి వచ్చే జీవనదులన్నీ అంతరించిపోతే.. ఇక మిగిలేది కరువు కాక మరేమిటి? అయితే, 2050 వరకు గంగ, బ్రహ్మపుత్ర, సింధు నదుల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇది సంతోషించాల్సిన విషయం కానే కాదు. ఎందుకంటే, మంచు ఆ స్థాయిలో కరిగిపోతున్నందుకు నిజంగా బాధపడాలి. 2050 తరువాత నుంచి క్రమంగా ఆ నదుల్లో నీటి ప్రవాహం తగ్గుతూ వస్తుంది. 2100 సంవత్సరం వచ్చే సరికి జీవనదులు పూర్తిగా ఎండిపోతాయి. హిమాలయాల్లోని మంచు కరిగిపోతే జరిగే ప్రమాదం ఇదే.

హిమాలయాల్లో పుట్టే నదులే.. 8 దేశాల్లోని 165 కోట్ల మందికి జలాధారం

Himalayas 6

Himalayas 6

హిమాలయాల్లో పుట్టే నదులు, పారే నీటి వల్లే ఎనిమిది దేశాల్లోని 165 కోట్ల మంది ప్రజలు బతకగలుగుతున్నారు. ఈ 165 కోట్ల మందికి తాగునీరు, సాగునీరు అందిస్తున్నది మన హిమాలయాలే. ఆ హిమాలయాలే భారతదేశాన్ని కాపాడుతున్నాయి. ఇది అక్షర సత్యం. కేరళలో మొదలయ్యే నైరుతి రుతుపవనాలు హిమాలయాలను తాకి అవే ఈశాన్య రుతుపవనాలుగా మారతాయి. ఇలా దేశమంతటా రుతుపవనాలు విస్తరించడానికి హిమాలయాలే కారణం అవుతున్నాయి. యూరప్ నుంచి విపరీతమైన చలిగాలులు మన దేశం వైపు వస్తుంటాయి. ముఖ్యంగా సైబీరియా ప్రాంతం నుంచి. కాని, ఆ అతి చల్లని గాలులను అడ్డుకుంటున్నది మన హిమాలయాలే. అవే గనక లేకపోతే, ఉత్తర భారతదేశం అంతా చలితో వణికిపోయేది, మంచులో గడ్డకట్టుకుపోయేది. అంటే, హిమాలయాలు లేకపోతే భారతదేశ ఉనికే ఉండదు. ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. అందుకే పాలకులు కూడా తక్షణం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. హిమాలయాల సంరక్షణకు అనుగుణంగా తక్షణం కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి.

పాకిస్తాన్ లో 90 శాతం ఆహారోత్పత్తులకు మూలాధారం సింధూ నదే!

Himalayas 7

Himalayas 7

సో, ఉష్ణోగ్రతలు పెరగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. మరో 75 సంవత్సరాల తరువాత భారతదేశానికి ఒక కోటలా రక్షణనిస్తున్న హిమాలయాలు కనుమరుగవుతాయి. 2004 నుంచి 2020 మధ్య హిమాలయాల్లో 840 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక పెద్ద మైదాన ప్రాంతం ఏర్పడింది. 2004 ముందు వరకు ఆ మైదాన ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పబడి ఉండేది. సో, 2100 సంవత్సరం నాటికి హిమాలయాల్లోని 75 శాతం మంచు కరిగిపోతుందనే చెప్పాలి. టిబెట్‌లో ఏర్పడిన సింధు నది వల్ల పాకిస్తాన్‌ ఏకంగా 90 శాతం ఆహార ఉత్పత్తులను తయారు చేసుకోగలుగుతోంది. రేప్పొద్దున సింధు నది అన్నదే లేకపోతే.. పాకిస్తాన్ కూడా లేనట్టే. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు టెన్షన్ పడుతోంది. నిజానికి హిమాలయాల వల్ల 8 దేశాలు లాభం పొందుతున్నాయి. సో.. వీటి సంరక్షణ బాధ్యత అన్ని దేశాలది అని మర్చిపోకూడదు. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ చూపాలి. లేదంటే దానికి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే.

హిమాలయాల్లో మంచు కింద ఏముందో తెలీదు గానీ.. ధ్రువ ప్రాంతాల్లో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా పెద్దమొత్తంలో ఉండొచ్చని చెబుతున్నారు. మంచు కరిగి, ఆ వాతావరణానికి డీకంపోజ్ అయితే.. అదే ఉష్ణోగ్రతలను మరింత పెంచుతుంది. ఇక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. వందల ఏళ్లుగా మంచుకింద కప్పబడి ఉన్న వైరస్‌లు మళ్లీ ప్రాణం పోసుకుంటాయట. అదే జరిగితే.. కొత్తకొత్త వైరస్‌లు మనిషిపై దండెత్తే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రమాదం ధ్రువప్రాంతాల్లో కాకుండా హిమాలయాల్లోనే జరిగితే..? ఇప్పటికైతే అలాంటి ప్రమాదం ఉందని ఎవరూ చెప్పలేదు. కాని, ఎవరూ చెప్పనంత మాత్రాన, ఇప్పటి వరకు కనుక్కోనంత మాత్రాన అక్కడ ఆ ప్రమాదం లేదని చెప్పలేం. సో, హిమాలయాల్లో మంచు కరగడం ఈ విధంగా కూడా ప్రమాదకరమే అని చెప్పాలి. అందుకే ప్రభుత్వాలు ఇప్పటికైనా హిమాలయాల పరిరక్షణకు నడుం బిగించాలి. హిమాలయాల రక్షణకు కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయాలి. అప్పుడే ముప్పు నుంచి కొంతైనా తప్పించుకోగలం.

మరిన్ని ప్రీమియం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఏడాది గురుపౌర్ణమి విషయంలో గందరగోళం.. ఏ తేదీన జరుపుకోవాలంటే
ఈ ఏడాది గురుపౌర్ణమి విషయంలో గందరగోళం.. ఏ తేదీన జరుపుకోవాలంటే
ఎవుర్రా నువ్వూ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..!
ఎవుర్రా నువ్వూ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..!
యాపిల్ పై తొక్క తీసి తింటున్నారా? అసలు విషయం తెలిస్తే..
యాపిల్ పై తొక్క తీసి తింటున్నారా? అసలు విషయం తెలిస్తే..
'అతను 8వ వింత.. అలాంటోడు దొరకడం చాలా అరుదు': విరాట్ కోహ్లీ
'అతను 8వ వింత.. అలాంటోడు దొరకడం చాలా అరుదు': విరాట్ కోహ్లీ
కొత్తిమీర జ్యూస్‌ రోజూ తాగితే ఈ సమస్యలన్నీ మాయం..! ప్రయోజనాలు
కొత్తిమీర జ్యూస్‌ రోజూ తాగితే ఈ సమస్యలన్నీ మాయం..! ప్రయోజనాలు
రికార్డు స్థాయిలో కూలుతున్న వంతెనలు.. అసలు కారణం ఏంటి..
రికార్డు స్థాయిలో కూలుతున్న వంతెనలు.. అసలు కారణం ఏంటి..
సూర్యుడి విశిష్టతను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
సూర్యుడి విశిష్టతను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. కాంగ్రెస్‎లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
బీఆర్ఎస్‎లో మరో కుదుపు.. కాంగ్రెస్‎లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
Team India: విజయోత్సవేళ టీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్..
Team India: విజయోత్సవేళ టీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్..
కర్నాటకలో 24 వేలకు పైగా డెంగ్యూ కేసులు.. హై అలెర్ట్‌ ప్రకటన..
కర్నాటకలో 24 వేలకు పైగా డెంగ్యూ కేసులు.. హై అలెర్ట్‌ ప్రకటన..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..