రష్యా, ఉత్తర కొరియాల నోటి వెంట అణ్వాయుధాల మాట! ఉత్తుత్తి బెదిరింపులా? నిజంగానే ప్రయోగిస్తాయా?

అమెరికా ఆధిపత్య ధోరణి చాలా దేశాలకు రుచించదు. ఇతర దేశాల అంతరంగిక విషయాలపై జోక్యం చేసుకోవడం, తాము ఆడిస్తున్నట్టుగా...

రష్యా, ఉత్తర కొరియాల నోటి వెంట అణ్వాయుధాల మాట! ఉత్తుత్తి బెదిరింపులా? నిజంగానే ప్రయోగిస్తాయా?
Kim
Follow us
Balu

| Edited By: Phani CH

Updated on: Apr 27, 2022 | 7:56 PM

అమెరికా ఆధిపత్య ధోరణి చాలా దేశాలకు రుచించదు. ఇతర దేశాల అంతరంగిక విషయాలపై జోక్యం చేసుకోవడం, తాము ఆడిస్తున్నట్టుగా ఆడే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఇప్పటికే కావాల్సినంత అప్రతిష్టను కూడగట్టుకుంది అమెరికా! పాకిస్తాన్‌ లో ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారంలోంచి దింపేందుకు అమెరికా పాలకులు ప్రయత్నించిన వైనం విదితమే! అంతకు ముందు ఇరాక్‌, అప్ఘనిస్తాన్‌లలో అమెరికా ఏం చేసిందో అందరికీ తెలిసిన విషయమే! అందుకే తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి రష్యా, ఉత్తరకొరియా వంటి దేశాలు. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అయితే అమెరికాకు ఓ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. ఎవరైనా తమను రెచ్చగొడితే అణుదాడికి కూడా సిద్ధమేనన్నారు. తమపై పెత్తన చెలాయించాలని చూస్తే అణ్వాయుధ సంపత్తిని మరింతగా పెంచుకుని తీరతామన్నారు కిమ్‌. యుద్ధం అంటే తమకు కూడా ఇష్టం లేదని, యుద్ధాన్ని నివారించడానికే ప్రయత్నిస్తామని, కానీ తమ దేశ ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదని కాసింత గట్టిగానే చెప్పారాయన. అణ్వాయుధాలతో ఎగురుదాడి చేస్తామని హెచ్చరించారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆయుధాల పరేడ్‌ నిర్వహించారు. ఈ ఆయుధ పరేడ్‌లో ఉత్తర కొరియాకి చెందిన అతి పెద్ద ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్‌–17 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అన్నట్టు ఈ క్షిపణి పరిధిలో అమెరికా అంతా ఉందట! అసలు అమెరికాను ఏ మాత్రం ఖాతరు చేయరు కిమ్‌.. అమెరికా అంటేనే అంతెత్తున లేస్తారు. ఇటు రష్యా అధినేత పుతిన్‌ కూడా అమెరికాపై ఆగ్రహోదగ్ధులవుతున్నారు. తమ దేశంపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తూ సహించేది లేదన్నారు పుతిన్‌. అమెరికాతో పాటు కొన్ని దేశాలు చేస్తున్న పనులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేట్టుగా ఉన్నాయని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. అమెరికా అండ చూసుకుని ఉక్రయిన్‌ తమను రెచ్చగొడుతున్నదని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో అణు యుద్ధ ముప్పును కొట్టిపారేయలేమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ చెప్పింది చూస్తే రష్యా ఎంతకైనా తెగించవచ్చని అర్థమవుతోంది. అలాగు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ను కూడా తిట్టిపోశారు. ఉక్రెయిన్‌పై దాడులను ఏ మాత్రమూ కొనసాగించలేనంతగా రష్యాను బలహీనపరచడమే తమ లక్ష్యమంటూ లాయిడ్‌ ఆస్టిన్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఉక్రెయిన్‌ రక్షణావసరాలను తీర్చడం కోసం ఎలాంటి చర్యనైనా చేపడతామన్నారు. ఈ వ్యాఖ్యలే సెర్గీ లావ్రోవ్‌కు కోపం తెప్పించాయి.

రష్యా దేశాధినేత పుతిన్‌కు ఇవన్ని తెలియని విషయాలేమీ కాదు. అందుకే దూకుడు పెంచారు. మూడో ప్రపంచ యుద్ధం రాకూడదంటూ శాంతి వచనాలు పలుకుతున్న చాలా దేశాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయన్నది పుతిన్‌ వాదన. తమ చేష్టల ద్వారా మూడో ప్రపంచయుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్నాయని పుతిన్‌ భావన . ఉక్రెయిన్‌కు ఆయుధాలను సమకూర్చడం ద్వారా నాటో దేశాలు తమ సహనాన్ని పరీక్షిస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ పేర్కొన్నారు. రష్యాతో ఒప్పందం చేసుకోవద్దంటూ ఉక్రెయిన్‌పై అమెరికా, ఇంగ్లండ్‌ ఒత్తిడి తెస్తున్నాయని, చర్చలు ఆగిపోవడానికి ఉక్రెయినే కారణమని ఆరోపిస్తున్నారు.లావ్రోవ్‌ చేసిన ఆరోపణలను అమెరికా, ఇంగ్లండ్‌ తప్పుపట్టాయి. లావ్రోవ్‌వి మతిలేని వ్యాఖ్యలని తిట్టిపోశాయి. అణు యుద్ధమంటూ జరిగితే అందులో విజేతలు, పరాజితులు ఉండరని, ఎవరూ మిగలరని పెంటగాన్ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ కిర్బీ వ్యాఖ్యానించారు. అసలు మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరూ కోరుకోరని చైనా అంటోంది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను అమెరికా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. రష్యాపై ఆంక్షలు విధించింది. రష్యా వ్యతిరేక దేశాలతో మంతనాలు జరిగింది. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచింది. ఆ దేశానికి కావల్సినంత సైనిక సాయాన్ని అందిస్తామని చెప్పింది. అమెరికా చర్యలు సహజంగానే రష్యాకు కోపం తెప్పించాయి. అమెరికా, దాని మిత్రదేశాలు తమను ఏమి చేయలేవని రష్యా అంటోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని విధాన నిర్ణయ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. పాశ్చాత్య దేశాల సలహాదారులు తమను నిలువరించలేరని అంటోంది. అమెరికా, బ్రిటన్‌ మాటలు విని ఉక్రెయిన్‌ పిచ్చి వేషాలు వేస్తే కీవ్‌లో ప్రభుత్వ భవనాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. హెచ్చరించడమే కాదు పొపాస్నా, లిసిచాన్స్‌క్, గిర్‌స్కే, ఖరీ్కవ్, జపోరిజియాలపై బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్‌కు అమెరికా సపోర్ట్‌ అపకపోతే నిజంగానే రష్యా అణుదాడులకు పాల్పడుతుందా? టాక్టికల్‌ అణ్వాయుధాలను అంటే తక్కువ ప్రాంతంలో విధ్వంసం సృష్టించే అణుబాంబులను ప్రయోగిస్తుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. పుతిన్‌ దూకుడు, మొండితనం చూస్తుంటే అణ్వాయుధ ప్రయోగాలకు వెనుకాడకపోవచ్చని చెబుతున్నారు. కొందరు మాత్రం పుతిన్‌ బెదింపులే తప్ప అంత సాహసం చేయబోరని అంటున్నారు. మొత్తంగా అమెరికాపై కోపంగా ఉన్న రష్యా, నార్త్‌ కొరియాలు అన్నంత పని చేస్తాయా? లేక ఉత్తుత్తి బెదిరింపులేనా అన్నది భవిష్యత్తు తేలుస్తుంది!

ఈ 4 బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌
ఈ 4 బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌లపై భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌
6 టెస్టులు, ఇంగ్లాండ్‌తో వేట మొదలు.. డబ్ల్యూటీసీ 2025-27లో..
6 టెస్టులు, ఇంగ్లాండ్‌తో వేట మొదలు.. డబ్ల్యూటీసీ 2025-27లో..
ఈ సీజన్‌లో కొబ్బరి పాలు తాగితే ఉండే లాభం అంతా ఇంతా కాదు..
ఈ సీజన్‌లో కొబ్బరి పాలు తాగితే ఉండే లాభం అంతా ఇంతా కాదు..
మీరు డయాబెటిక్‌ బాధితులా..? ఈ బియ్యం తినండి.. దెబ్బకు నార్మల్
మీరు డయాబెటిక్‌ బాధితులా..? ఈ బియ్యం తినండి.. దెబ్బకు నార్మల్
శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
శతాబ్దాల చరిత్రగల బంగారు బావి..!
చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగాలో తెలుసా..
చలికాలంలో పాలు తాగడానికి నియమాలున్నాయి.. ఎలా తాగాలో తెలుసా..
దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది
దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ ఎఫ్‌డీసీ కొత్త శిఖరాలను చేరుకుంటుంది
సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్‌.. సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు
సౌదీ అరేబియాకు మరో జాక్‌పాట్‌.. సముద్రం నిండా తెల్లబంగారం నిల్వలు
కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.3 లక్షల కోట్లు ఆవిరి
కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.3 లక్షల కోట్లు ఆవిరి
రోడ్డు రోలర్ శబ్దాన్ని భూకంపంగా పొరబడి..భవనంలోంచి దూకేసిన బాలికలు
రోడ్డు రోలర్ శబ్దాన్ని భూకంపంగా పొరబడి..భవనంలోంచి దూకేసిన బాలికలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..