Plastic surgery: కృత్రిమ సౌందర్యం కోసం ఆరాటం.. ప్రాణాలు కోల్పోతున్న వైనం

సహజ సౌందర్యాన్ని కాదని కృత్రిమ సౌందర్యం కోసం ప్రయత్నించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందం పెరుగుతుందన్న....

Plastic surgery: కృత్రిమ సౌందర్యం కోసం ఆరాటం.. ప్రాణాలు కోల్పోతున్న వైనం
Cosmetic Surgery

Updated on: Jul 18, 2021 | 7:13 PM

సహజ సౌందర్యాన్ని కాదని కృత్రిమ సౌందర్యం కోసం ప్రయత్నించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ప్లాస్టిక్ సర్జరీలతో అందం పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. అయినా ప్రయత్నించి భంగపడుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి మీకు వివరిస్తాం. శాంటోస్ మీన అనే బాడీ బిల్డర్ మెక్సీకోలో నివశిస్తూ ఉండేది. ఆమె చాలా అందంగా ఉంటుంది.. ఆరోగ్యం విషయంలో కూడా ఢోకా లేదు. కానీ వర్కవుట్ చేసే సమయంలో చెమట పడితే తట్టుకోలేకపోయింది. గంటల కొద్ది ఎక్స్‌ర్‌సైజులు చేసినా చెమట చుక్క రాకుండా సర్జరీ చేసుకోవాలని డిసైడ్ అయింది. యాంటీపెర్స్పిరాంట్‌ అనే ట్రీట్‌మెంట్‌తో చెమట గ్రంథులను హీట్‌ ఎనర్జీ టెక్నిక్‌తో ఆపరేట్‌ చేస్తారు. ఇది సక్సెస్ అయితే చెమట రాదన్నమాట. సర్జరీలో భాగంగా శాంటాకు మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మోనా చనిపోయింది. అనస్థిషీయా, స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్లే చనిపోయిందన్నది డాక్టర్ల మాట.

Santos Mena

గతంలో తెలుగు హీరోయిన్ ఆర్తీ అగర్వాల్‌ లైపోసక్షన్ కాస్మెటిక్ సర్జరీ వికటించి చనిపోయింది. ఇంట్లోనే మెట్లపై నుంచి జారి కిందపడి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయిందన్నది కుటుంబసభ్యుల వాదన. కానీ అసలు నిజం మాత్రం సర్జరీనే అన్న అనుమానాలు ఉన్నాయి.

ఆర్తి అగర్వాల్…

హైదరాబాద్‌లో నిఖిల్ అనే యువకుడు హైట్‌ కోసం తపించి దారుణమైన పరిస్థితికి చేరుకున్నాడు. ఎత్తు పెరిగేందుకు డాక్టర్లను సంప్రదించి 7లక్షలు సమర్పించుకున్నాడు. ఆపరేషన్ అయిన మూడు రోజులకి రెండు కాళ్లకి తీవ్రంగా వాపు వచ్చి కదల్లేని స్థితికి చేరుకున్నాడు.

Nikhil

అందాల తార శ్రీదేవి మరణం విషయంలోనూ చాలా సందేహాలు ఉన్నాయి. నవ యవ్వనంగా కనిపించేందుకు పదే పదే సర్జరీలు చేయించుకున్నారు. ఎలాంటి డ్రెస్సింగ్‌లోనైనా ఇమిడేలా శరీరాకృతి ఉండాలన్న తపనతో చేసుకున్న ఆపరేషన్లు వికటించి చనిపోయారనే టాక్‌ ఉంది.

పెదాల కోసం ఒకరు.. బట్టతల పోవాలని ఇంకొకరు.. ముఖంపై మచ్చలు రావొద్దంటూ మరోకరు.. ఇలా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు సర్జరీల కోసం వెంపర్లాడుతూనే ఉన్నారు. కానీ అవి వికటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చాలామంది లేని అందం కోసం ఆరాటపడుతూ మునుపటి కంటే దారుణమైన పరిస్థితిని కొనితెచ్చుకుంటున్నారు.

Also Read: ఈమె లేడీ కాదు…కిలాడీ.. నాలుగు పెళ్లిళ్లు.. ఎన్నో మోసాలు

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఆ ఆరుగురిపైనే సీబీఐ ఫోకస్