Viral Video: డాగా..?.. డ్యాన్సరా.? యువతితో సమానంగా కాళ్లు కదుపుతున్న శునకం.. నెట్టింట వీడియో వైరల్..
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు యూజర్లను, నెటిజన్లను..
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు సర్క్యూలేట్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు యూజర్లను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగానే కొన్ని కుక్కలు మనుషులను అనుకరిస్తుంటాయి. పెంపుడు కుక్కలైతే ఇక చెప్పనక్కర్లేదు. వాటి ట్రైనింగ్, వాటి పెంపకం, వాటి తెలివితేటలు.. అబ్బో.. దాదాపు మనిషి చేసినట్లుగానే అన్నీ చేసేస్తుంటాయి పలు కుక్కలు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చర్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోలో ఉన్న కుక్క టాలెంట్‌ని చూస్తే మీరు ఖచ్చితంగా ఫిదా అయిపోతారనడంలో సందేహం లేదు.
ఈ వీడియోలో అర్థ్రా ప్రసాద్ అనే మహిళ డ్యాన్స్ చేస్తోంది. ఆమె వెనుకాలే ఓ కర్రకు కుక్కను కట్టేశారు. యువతి అలా క్లాసికల్ డ్యాన్స్ చేయడం ప్రారంభించడమే ఆలస్యం.. కుక్క కూడా లేచి నిలుచుంది. రెండు కాళ్లపై నిలబడి.. మరో రెండు కాళ్లతో డ్యాన్స్ చేస్తోంది. పాటకు తగ్గట్లుగా ఆమె నృత్యం చేస్తున్నట్లుగానే.. కుక్క కూడా తన రెండు కాళ్లను కదిలిస్తూ స్టెప్పులు వేస్తోంది. మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ కుక్క డ్యాన్స్ వీడియోను ‘శ్రీజిత్ త్రిక్కర’ అనే ఫేస్‌బుక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుక్క డ్యాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.
Viral Video:
Also read:
RBI: అవుట్ సోర్సింగ్ పాలసీపై మార్గదర్శకాలను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా