Funny Video: పాపం అమాయక పులులు.. మాంసం కోసం ఆపసోపాలు పడుతున్నాయి.. ఫన్నీ వీడియో మీకోసం..
Funny Video: ‘దురాశ దుక్కానికి చేటు’ అనే నానుడి సరిగ్గా ఈ పులులకు సరిపోలుతుంది. ఎదురుగా ఉన్న మాంసం ముక్కలను చూసి..
Funny Video: ‘దురాశ దుక్కానికి చేటు’ అనే నానుడి సరిగ్గా ఈ పులులకు సరిపోలుతుంది. ఎదురుగా ఉన్న మాంసం ముక్కలను చూసి ముందూ వెనుకా ఆలోచించకుండా ఆ మాంసం కోసం దూకి నీటి గుంటలో పడ్డాయి పులులు. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా మాంసం అంటే పులుకు ఇష్టం అనే విషయం తెలిసింందే. అటవీ ప్రాంతంలో అవి ఇతర జంతువులను వేటాటి చంపుకుని తింటాయి. కానీ, ‘జూ’ లో ఉండే జంతువులకు ఆ ఛాన్స్ ఉండదు. ‘జూ’ నిర్వాహకులు పెడితే గానీ అవి తినలేవు.
తాజాగా ఓ ‘జూ’ లో కొన్ని పులుల గుంపు ఉంది. వాటికి ఆహారంగా మాంసం అందించారు. అయితే, వాటిని నేరుగా వేయకుండా.. ఓ మాంసం ముక్కను తాడుకు వేలాడదీశారు. అలా ఆ తాడుతో పులులకు టాస్క్ పెట్టారు. పక్కనే నీటి కుంట ఉండగా.. ఆ నీటి కుంటపై మాంసం ముక్కను వేలాడదీశారు. అయితే, ఆ పులుల మందకు మాంసం ముద్ద మాత్రమే కనిపించింది. నీటిని పెద్దగా కేర్ చేయనట్లుంది. అందుకే మాంసం ముద్దను అందుకునేందుకు తెగ ట్రై చేశాయి. కానీ నిర్వాహకులు మాత్రం ఆ పులులతో కాసేపు సరదాగా ఆడుకున్నారు. పులులు ఆ మాంసం ముద్దను అందుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి దానిని పైకి లాగేశారు. దాంతో ఆ పులులు మాంసం ముద్దను అందులేక.. నీటి కుంటలో పడిపోతాయి. అయితే, పులులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అలా ప్రయత్నీస్తూనే ఉన్నాయి. కాగా, ఈ ఫన్నీ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Video:
#UEFA और #COPA की स्थिति..??☺️☺️☺️
जूझते खिलाड़ी ☺️☺️☺️☺️? pic.twitter.com/jGxDbazqMT
— Rupin Sharma IPS (@rupin1992) June 27, 2021
Also read:
Viral Video: డాగా..?.. డ్యాన్సరా.? యువతితో సమానంగా కాళ్లు కదుపుతున్న శునకం.. నెట్టింట వీడియో వైరల్..
RBI: అవుట్ సోర్సింగ్ పాలసీపై మార్గదర్శకాలను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా