Woman Winking: అందరూ చూస్తుండగానే అతనివైపు కన్నుకొట్టింది.. ఆ తరువాతే అసలు కథ మొదలైంది..!

Woman Winking: ‘ఒరు అదార్ లవ్’ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? ఉండే ఉంటుంది లేండి. మర్చిపోయే స్టారా తను.

Woman Winking: అందరూ చూస్తుండగానే అతనివైపు కన్నుకొట్టింది.. ఆ తరువాతే అసలు కథ మొదలైంది..!
Woman Winkle
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 29, 2021 | 11:35 PM

Woman Winking: ‘ఒరు అదార్ లవ్’ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? ఉండే ఉంటుంది లేండి. మర్చిపోయే స్టార్ ఆ తను. ఒక్క సీనులో ‘కన్ను గీటి’ ఓవర్‌ నైట్‌లో నేషనల్ లెవల్ ఫేమ్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందా? గుర్తుండే ఉంటుంది లేండి. అంత ఈజీగా మర్చిపోగలమా ఆ సీన్‌ను. ఒక్కసారి కన్నుగీటి యావత్ దేశ యువతరాన్ని ఫిదా చేసేసింది. ఆ ఒక్క సీన్‌తో ఎవరికీ లేని క్రేజ్‌ను సంపాదించుకుంది. అంతేస్థాయిలో సినీ ఆఫర్లను కొట్టేసింది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే. తాజాగా ఓ వివాహ వేడుకలో ఓ వధువు కూడా అదే రేంజ్‌లో కన్నుగీటి ఎదుటి వారిని ప్లాట్ చేసేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఆ వీడియోలో ఏముందంటే.. కొందరు వ్యక్తులతో కలిసి ఓ యువతి నిల్చుకుని వారందరి మెడలో పూలదండలు, బొట్టు పెట్టుకుని ఉన్నారు. వారిని పలువురు వీడియోలు, ఫోటో తీస్తుండగా.. ఓ వ్యక్తి కూడా వారిని తన ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. ఇంతలో మధ్యలో యువతిని మాత్రమే జూమ్ చేసి వీడియో తీశాడు. ఆ ఫోన్ కెమెరా వైపు చిరు నవ్వు నవ్వుతూ కొంటె చూపులతో చూసింది. అలా చూసిన యువతి కాసేపటి తరువాత.. కన్నుగీటింది. యువతి కన్నుగీటిన దృశ్యం ఆ ఫోన్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో యువతి అందం, అభినయంతో పాటు.. తన చిలిపి చేష్టలతో అందరినీ ఆకట్టుకుంది.

Viral Video:

అయితే, యువతి కన్నుగీటిన వీడియోను ‘jaat_k_jokes’ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్ల యువతి అందం, ముద్దమందారం లాంటి చిరు నవ్వు, అభియనం చూసి ఫిదా అయిపోతున్నారు. అన్నికంటే ముఖ్యంగా యువతి కన్నుగీటడం చూసి ప్లాట్ అయిపోతున్నారు. అందుకే నెటిజన్లు ఆ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా ఇప్పుడది అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తోంది.

Also read:

Govt Liquor shops : ఏపీలోని ప్రభుత్వ మద్యం షాపులలో వరుస దొంగతనాలు.. పలు అనుమానాలకు తావిస్తున్న వైనాలు

White Sauce Pasta: ఇంట్లోనే వైట్ సాస్ పాస్తా.. ఎలా తయారు చేసుకోవాలంటే..!

Lady Ayurveda doctor : హైదరాబాద్ ఆయుర్వేద డాక్టరమ్మని ట్రాప్ చేసి 41లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్