AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fridge in Library : వాహ్‌! వాటెన్‌ ఐడియా సర్‌ జీ.. ఫ్రిజ్‌ని ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది..

Fridge in Library : పుస్తక పఠనం ద్వారా మేథస్సును పెంపొందించుకోవచ్చు. ఇప్పుడంటే సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ అంటున్నారు కానీ గతంలో లైబ్రరీలే

Fridge in Library : వాహ్‌! వాటెన్‌ ఐడియా సర్‌ జీ.. ఫ్రిజ్‌ని ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది..
Fridge In Library
uppula Raju
|

Updated on: Apr 03, 2021 | 5:13 PM

Share

Fridge in Library : పుస్తక పఠనం ద్వారా మేథస్సును పెంపొందించుకోవచ్చు. ఇప్పుడంటే సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ అంటున్నారు కానీ గతంలో లైబ్రరీలే అందరికి దిక్కు.. అయినా కంప్యూటర్లు , సెల్‌ ఫోన్లు అందుబాటులోకి వచ్చినా చివరకు మళ్లీ అందరు పుస్తకాలవైపే చూస్తున్నారు. ఎందుకంటే పుస్తకం చదివితే కలిగే అనుభూతి వేరే రకంగా ఉంటుంది. అందుకే చాలామంది పుస్తక పఠనం కొనసాగిస్తున్నారు. అందుకోసం చాలా పుస్తకాలను సేకరించి ఇంట్లోని కబోర్డులను మొత్తం నింపుతారు. స్థలం లేకపోతే ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ లైబ్రరీ ఏర్పాటుచేస్తారు. కానీ దక్షిణ కోల్‌కతాలో ఓ ఉపాధ్యాయుడు ప్రిజ్‌నే ఏకంగా లైబ్రరీ చేసేశాడు.. ఆ విశేషాలేంటో ఇప్పడు చూద్దాం..

పఠనాసక్తిని పెంపొందించడం కోసం స్థానిక ఉపాధ్యాయుడు, అతని భార్య ఓ దుకాణాదారుడితో కలిసి ఈ ‘లైబ్రరీ ఇన్ ఫ్రిజ్’‌ను ఏర్పాటు చేశారు. డిక్షనరీ, నవలలు, లిటరరీ మ్యాగజైన్స్(ఇంగ్లిష్, బెంగాలీ)తో పాటు మొత్తంగా 100 పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఆసక్తిగల పాఠకులు డైరీలో తమ ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఫిల్ చేసి పుస్తకాన్ని ఇంటికి తీసుకువెళ్లి, నెలరోజుల్లో తిరిగి ఇవ్వవచ్చు. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ పుస్తకాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం పాఠకుడిదే.

దీని గురించి ఆ ఉపాధ్యాయుడిని అడిగితే ఇలా చెబుతున్నాడు.. ఈ ప్రాజెక్ట్ కోసం దగ్గర్లో ఉన్న కిరాణా షాపును ఎంచుకున్నాను. అలా అందరి దృష్టి ఈ స్ట్రీట్ లైబ్రరీపై పడుతుందనుకున్నాను. పాత ప్రిజ్‌ను పుస్తకాలతో నింపేసి అక్కడ పెట్టాను. దాదాపు 45 వేల ఖర్చుతో అన్నిరకాల పుస్తకాలు కొనుగోలు చేశాను. ప్రస్తుతం నా దగ్గర 1000 పుస్తకాలు ఉన్నాయి. రెస్సాన్స్ చాలా బాగుందని సంతోషపడుతున్నాడు.

KTR : సాగులో కేసీఆర్ దేశానికే పాఠాలు నేర్పుతుంటే, గుజరాత్‌లో కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందించడం లేదు : కేటీఆర్

IPL 2021: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.? త్వరలోనే అధికారిక ప్రకటన.!

మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. ‘రూపాయికే ఇడ్లీ’ అందించిన బామ్మ కమలాత్తాళ్‌కు సొంతిల్లు