భద్రాద్రి ప్రజలకు వైకుంఠపాళీ కష్టాలు !

రాష్ట్ర విభజన వారికి శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా మార్చిన విభజన చట్టం కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. దక్షిణ ఆయోధ్యగా పిలిచే భద్రాచలం ప్రజలకు చావును కూడా సమస్యగా మార్చింది.

భద్రాద్రి ప్రజలకు వైకుంఠపాళీ కష్టాలు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 16, 2020 | 12:27 PM

రాష్ట్ర విభజన వారికి శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా మార్చిన విభజన చట్టం కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. దక్షిణ ఆయోధ్యగా పిలిచే భద్రాచలం ప్రజలకు చావును కూడా సమస్యగా మార్చింది. ఆంధ్ర – తెలంగాణ విభజన భద్రాచలం ప్రజలకు లేని కష్టాలను తెచ్చిపెట్టింది. రాష్ట్ర విభజనలో భాగంగా భద్రాచలం పట్టణం మినహా మిగిలిన భూభాగం ఏపీలో విలీనమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న కాలనీల శివార్లలో మృతదేహాలకు అంత్యక్రియలు జరిగేవి. ఇప్పుడు ఆ గ్రామాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి వెళ్లడంతో అసలు సమస్య మొదలైంది. రాష్ట్ర సరిహద్దు దాటి మృతదేహాలను పూడ్చేందుకు వీల్లేదంటూ ఆంధ్రా అధికారులు అడ్డుపడటం ఇబ్బందిగా మారింది. దీంతో ఒక పక్క గోదావరి నది, మరోప్రక్క ఆంధ్రా సరిహద్దు ఉండటంతో శవాలను ఎక్కడ పూడ్చాలో భద్రాద్రి ప్రజలకు దిక్కుతోచడం లేదు. చివరకు చేసేదేమీ లేక కరకట్ట ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం కేటాయించిన కొద్దిపాటి స్మశాన వాటికలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొన్నిసార్లు శవాలను ఖననం చేసే సమయంలో ఇంతకు ముందు పూడ్చిన శవాల అస్థికలు, అవశేషాలు బయటపడతుండట స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు స్మశాన వాటిక గోదావరి ఒడ్డున ఉండటం వల్ల ప్రతి ఏడాది వరదల సమయంలో ఖననం చేయడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భద్రాచలం పట్టణ జనాభా ప్రస్తుతం 80 వేలు దాటింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని స్మశాన వాటిక సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాచలం పరిసర గ్రామాలను ఏపీలో విలీనం చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, శ్మశాన వాటిక కోసం స్థల సేకరణ చేస్తున్నామన్నది స్థానిక అధికారులు చెబుతున్నమాట. విభజన జరిగిన ఆరేళ్ల నుంచి భద్రాచలం ప్రజలను తీరని సమస్యగా మారింది. అప్తులను కోల్పోయిన బాధతోపాటు వారిని ఎక్కడ ఖననం చేయాలో తెలియని ఆయోమయం మానసిక వేదనకు గురి చేస్తోంది. ఇకనైనా భద్రాచలం ప్రజల వైకుంఠపాళి కష్టాలు తీరుతాయని ఆశీద్దాం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు