OMG: తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకారులు షాక్.. చేపల కోసం వేసిన వలలో చిక్కిన మొసలి -Watch Video

తూర్పు గోదావరి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్సకారుల వలకు చిక్కిందో మొసలి.. దాన్ని బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

OMG: తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకారులు షాక్.. చేపల కోసం వేసిన వలలో చిక్కిన మొసలి -Watch Video
Crocodile Caught In Fishing
Follow us

|

Updated on: Oct 14, 2021 | 5:33 PM

చేపల వేటకు వెళ్లిన మత్సకారులకు అప్పుడప్పుడూ జాక్‌పాట్‌ తగులుతుంది. కొన్ని సందర్భాల్లో ఊహించని అరుదైన చేపలో.. ఇతర ప్రాణులో దొరుకుతుంటాయి.. తూర్పుగోదావరి జిల్లాలోని మత్సకారులకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది.  తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం వద్దిపర్రు పల్లెగూడెంకు చెందిన మత్స్యకారులు ఎప్పటిలాగే వేటకు వెళ్లారు. గౌతమి గోదావరిలో చేపలు పట్టేందుకు వల విసిరారు.. వలకు ఏదో బరువైంది తగిలింది.. పెద్ద చేపే పడిందనే ఆనందంతో లాగి చూస్తే వలలో మొసలి కనిపించడంతో అవాక్కయ్యారు.. మొసలిని జాగ్రత్తగా బంధించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మత్స్యకారులు ఫారెస్టు అధికారులకు ఈ సమాచారాన్ని అందించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని మత్సకారులకు ఒక చోట వలకు మొసలి చిక్కితే, మరోచోట అరుదైన చేప దొరికి భారీ ధరపలికింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప సముద్ర తీరంలో 20 కేజీల బరువున్న భారీ తెరపార చేప దొరికింది.. సొర చేప జాతికి చెందిన దీన్ని స్థానికంగా సోఠారి అని కూడా పిలుస్తారు.. సాధారణ చేపలకు భిన్నంగా ఉండటంతో ఈ చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు..ఈ తెరపార చేపను వేలం వేయగా భారీ ధర పలికింది.

చేపల వలలో పట్టుబడిన మొసలి.. వీడియో చూడండి