Viral News: వధువుకు వరుడి ఊహించని కానుక.. ఏకంగా 60 కేజీల బంగారంతో..

Viral News: వివాహ వేడుక అంటేనే..కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు..సరదాల సందడి..పెళ్లిలో వధువు వరులిద్దరూ..పెళ్లి దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారు..

Viral News: వధువుకు వరుడి ఊహించని కానుక.. ఏకంగా 60 కేజీల బంగారంతో..
60 Kg Gold
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 14, 2021 | 9:58 AM

Viral News: వివాహ వేడుక అంటేనే.. కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు.. సరదాల సందడి.. కలగలిపి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిలో వధువు వరులిద్దరూ..పెళ్లి దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అందులోనూ పెళ్లి కూతురు ప్రత్యేక అలంకరణలో మరింతగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. అయితే,పెళ్లిలో అమ్మాయికి అబ్బాయి తరపువారు, అబ్బాయికి అమ్మాయి తరపువారు కానుకలు ఇవ్వడం రివాజు. ఇప్పుడు మనం చెప్పుబోయే వివాహ వేడుకలోనూ వరుడు తన కాబోయే భార్యకు కానుక ఇచ్చాడు. అయితే, ఎవరూ ఊహించని రీతిలో వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ మండపంలోనే కాబోయే భర్త వధువుకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. ఒక్కోటి కిలో బ‌రువున్న 60 బంగారు నెక్లెస్‌ల‌ను వరుడు ఆమెకు కానుక‌గా అందించాడు. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధ‌రించి త‌న చేతిలో గులాబీలు ప‌ట్టుకుని ఒంటి నిండా న‌గ‌ల‌తో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంప‌న్న కుటుంబానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో వ‌ధువును బంగారు ఆభ‌ర‌ణాల్లో ముంచెత్తాడు. కాగా, సెప్టెంబ‌ర్ 30న జ‌రిగిన ఈ వివాహ వేడుక‌లో భారీ బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించిన వ‌ధువును చూసి బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. భారీ బంగారు ఆభరణాలతో క‌నిపించే వ‌ధువు ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇక కొంతమంది టీనేజీ యువతులైతే తమకు ఇలాంటి వరుడు వస్తే ఎంత బాగుంటుందో అని చమత్కరిస్తున్నారు.

Also read:

Rakul Preet Singh Marriage: బాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకుతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వీడియో

Hyderabad: పీకలదాకా తాగారు.. ఆపై బిల్లు కట్టమంటే ‘నై’ అన్నారు.. చివరికి ఏం జరిగిందంటే..

Viral Video: బట్టలు ఉతికిన చింపాంజి.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!