Honey Bees: ఒక తేనెటీగ తన జీవితకాలంలో ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా?.. ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

Honey Bees: భూమిపై తేనెటీగలు మిలియన్ల సంవత్సరాలుగా తేనెను తయారు చేస్తున్నాయి. తేనెటీగలు తయారుచేసిన తేనెతో ఎన్నో..

Honey Bees: ఒక తేనెటీగ తన జీవితకాలంలో ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా?.. ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
Bees
Follow us

|

Updated on: May 25, 2021 | 10:26 PM

Honey Bees: భూమిపై తేనెటీగలు మిలియన్ల సంవత్సరాలుగా తేనెను తయారు చేస్తున్నాయి. తేనెటీగలు తయారుచేసిన తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. తేనె గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇవి అనేక రకాల సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. మానవులకు ఈ ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చే తేనెటీగలు తమ జీవిత కాలంలో ఒక స్ఫూన్ తేనెను తయారీ చేస్తాయి. మానవులకు ఇంతటి ఉపకారం చేస్తున్న తేనెటీగల గురించి కొన్ని అద్భుతమైన, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. తేనెటీగలు మిలియన్ల సంవత్సరాలుగా భూమిపై నివసిస్తూ తేనె తయారు చేస్తున్నాయి.

2. భూమిపై 20 వేలకు పైగా రకాల తేనెటీగలు ఉన్నాయి. వీటిలో 5 జాతుల తేనెటీగలు మాత్రమే తేనెను తయారు చేస్తాయి.

3. ఒక తేనె తెట్టులో సుమారుగా 50 వేల తేనెటీగలు నివసిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తేనెటీగలు మైనం లాంటి ఒక పదార్థాన్ని విసర్జించి తద్వారా తేనె తెట్టును తయారు చేస్తాయి.

4. ఈ తేనె తెట్టులో మూడు రకాల తేనె టీగలు ఉంటాయి. వాటిలో వేలాది సంఖ్యలో ఆడ తేనెటీగలు ఉంటే.. వందల సంఖ్యలో మగ తేనె టీగలు ఉంటాయి. ఇక ఒక రాణి తేనెటీగా మాత్రమే ఉంటుంది.

5. తేనె తుట్టెలో నివసించే ఆడ తేనెటీగలను కార్మికులు అని చెప్పవచ్చు. ఈ తేనె టీగలు తేనెను ఉత్పత్తి చేస్తాయి. ఇక మగ తేనె టీగలు రాణి తేనెటీగ కోసం ఉంటాయి.

6. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వందలాది మగ తేనెటీగలు రాణి తేనెటీగతో సంపర్కం చేస్తాయి. తద్వారా రాణి తేనెటీగ గర్భవతి అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. అయితే, ఈ ప్రయత్నంలో ఒక మగ తేనెటీగ మాత్రమే విజయం సాధిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

7. ఇక తేనె తుట్టెలో నివసించే తేనెటీగల్లో రాణి తేనెటీగ మాత్రమే గుడ్లు పెడుతుంది. ఇది ఒక రోజులో 2,000 కంటే ఎక్కువ గుడ్లు పెడుతుందట. వేసవిలో సంతానోత్పత్తి సమయంలో ఈ సంఖ్య 2,500 లకు చేరుకుంటుందట.

8. తేనెటీగ గరిష్ట జీవితకాలం ఒక నెల. కానీ తేనెటీగల రాణి మాత్రం చాలా కాలం జీవిస్తుందట. అంతేకాదు.. దీని బరువు, పరిమాణం మిగతా తేనెటీగల కన్నా పెద్దగా ఉంటుందట.

9. ఒక తేనెటీగ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. ఇది సెకనులో 200 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది.

10. తేనెటీగల వాసన మానవుల వాసన కంటే ఎక్కువ. ఒక తేనెటీగ దాని మొత్తం జీవితంలో ఒక టీస్పూన్ తేనెలో 12వ భాగాన్ని మాత్రమే ఉత్పత్తి చేయగలదు.

11. తేనెటీగలు ఒక పౌండ్ (454 గ్రాముల) తేనె తయారు చేయడానికి 55 వేల మైళ్ళు (88514 కిలోమీటర్లు) దూరం ప్రయాణించాలి.

Also read:

Liquor bottles seized : అక్రమ మద్యం అమ్మకం, నాటు సారా తయారీ కేంద్రాలపై తూర్పుగోదావరి జిల్లా పోలీసుల దాడులు

Hari Hara Veera Mallu: 3 లుక్స్‌, 30 గెటప్స్‌… పవన్‌ కోసం బిగ్ ప్లాన్‌.. అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న క్రిష్