Welwitschia Plant : ముప్పై తరాలైన ఈ మొక్క ఎండిపోదు..! మీరెప్పుడైనా దీనిని చూశారా..?

|

Aug 03, 2021 | 2:49 PM

Welwitschia Plant : భూమిపై ఉన్న ప్రతి జీవికి వయస్సుకి పరిమితి ఉంటుంది. కొంత కాలం తర్వాత అవి చనిపోతాయి. కానీ శాస్త్రవేత్తలు

Welwitschia Plant : ముప్పై తరాలైన ఈ మొక్క ఎండిపోదు..! మీరెప్పుడైనా దీనిని చూశారా..?
Welwitschia
Follow us on

Welwitschia Plant : భూమిపై ఉన్న ప్రతి జీవికి వయస్సుకి పరిమితి ఉంటుంది. కొంత కాలం తర్వాత అవి చనిపోతాయి. కానీ శాస్త్రవేత్తలు ఒక మొక్కను కనుగొన్నారు. దీని వయసు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును ఈ మొక్క పేరు వేల్విచియా. దీని వయస్సు వేలాది సంవత్సరాలు. ఒక వ్యక్తి 30 తరాలు గడిచిపోతాయి కానీ ఈ మొక్క ఎండిపోదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మొక్క ఎడారిలో చాలా వేడి ప్రాంతాల్లో పెరుగుతుంది.

వెల్విచియా మొక్కలు 3000 సంవత్సరాలకు పైగా జీవించగలవు..

శాస్త్రవేత్తల ప్రకారం వెల్విచియా 3000 సంవత్సరాలకు పైగా జీవించగల ఎడారి మొక్క. ఎడారిలో ఏర్పడే అత్యంత కఠినమైన వాతావరణం ఈ మొక్క దీర్ఘకాలం జీవించడానికి ప్రేరణనిచ్చిందని వారు చెబుతున్నారు. దాదాపు రెండు మిలియన్ సంవత్సరాల క్రితం వెల్విచియా మొక్క కణ విభజన ప్రక్రియలో ఎన్నో మార్పులు సంభవించాయన్నారు. ఆ మార్పు సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉందని గుర్తించారు. కఠినమైన వాతావరణంలో కూడా వెల్విచియా జీవిస్తుంది.

వెల్విచియా దక్షిణ అంగోలా, నమీబియాలో కనిపిస్తుంది..

వెల్విచియా వయస్సును బట్టి ఇది భూమిపై ఎక్కువ కాలం జీవించే మొక్కగా గుర్తించారు. ప్రస్తుతం వెల్విచియా కంటే ఎక్కువ కాలం జీవించే మొక్క మరొకటి లేదు. వెల్విచియా ప్రధానంగా దక్షిణ అంగోలా, నమీబియాలో కనిపిస్తుంది. అక్కడ వాతావరణం చాలా కాలం పాటు వేడిగా ఉంటుంది. ఇక్కడ కనిపించే వెల్విచియాలోని అనేక మొక్కలు 3000 సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు చెప్పారు. లండన్ లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలోని మొక్కల జన్యుశాస్త్రవేత్త, పొడవైన మొక్కను కనుగొనే అధ్యయనంలో భాగంగా వెల్విచియా నిరంతరం పెరుగుతున్న మొక్క అని గుర్తించాడు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 1859 సంవత్సరంలో మొక్కల జన్యుశాస్త్రవేత్త ఫ్రెడరిక్ వెల్విచ్ పురాతన మొక్కలను అధ్యయనం చేస్తున్న సమయంలో వెల్విచియా మొక్కను గుర్తించారు. దీని దీర్ఘాయువు వెనుక దానిలో ఉన్న జన్యు నిర్మాణమే అని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Sajjala: అమర్ రాజా బ్యాటరీ సంస్థ పోవడం కాదు.. ఏపీ ప్రభుత్వమే పొమ్మంటోందిః సజ్జల

విడుదలైన రెడ్‌మీ నూతన ల్యాప్‌టా‌ప్‌లు.. ఆగస్టు 6 నుంచి అందుబాటులోకి.. ధర ఎంతంటే?

Viral Pic: ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!