e-Challan: ఇదే చిత్రం గురూ..! హెల్మెట్‌ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్.. దీంతో అతడు ఏం చేశాడంటే..?

|

Jan 31, 2021 | 4:29 PM

బైక్ రైడ్ చేసే వ్యక్తికి హెల్మెట్ లేదని చలానా రాయటం కామన్. కానీ మహబూబాబాద్‌ జిల్లాలో ఒక ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలాంటి చలాన్‌ వచ్చింది. సీతానాగారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ ధరించలేదని...

e-Challan: ఇదే చిత్రం గురూ..! హెల్మెట్‌ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్.. దీంతో అతడు ఏం చేశాడంటే..?
Follow us on

e-Challan:  బైక్ రైడ్ చేసే వ్యక్తికి హెల్మెట్ లేదని చలానా రాయటం కామన్. కానీ మహబూబాబాద్‌ జిల్లాలో ఒక ట్రాక్టర్ డ్రైవర్‌కు ఇలాంటి చలాన్‌ వచ్చింది. సీతానాగారం గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు హెల్మెట్ ధరించలేదని చలానా విధించినట్లు మెసేజ్‌ వచ్చింది. అది చూసిన బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే ట్రాఫిక్‌ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఈ నెల 28 న వరంగల్ నగరం లో రోడ్డుపై హెల్మెట్ లేకుండా వెళుతున్న బైక్ నెంబర్ TS 26 E 5360 ఫొటో తీసిన పోలీసులు.. ఆ బైకు యజమానికి జరిమానా విధించారు. ఇంతవరకు బాగానే ఉంది. హెల్మెట్ లేకుండా వెళుతున్న బైకు యజమానులకు ఇలాంటి ఫైన్‌లు వేయాల్సిందే. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ బైక్ నంబర్‌కు పోలీసులు వేసిన జరిమానా.. ఓ ట్రాక్టర్ యజమానికి పడింది. అతడి ఫోన్ నంబర్‌కు ఇందుకు సంబంధించిన మెసేజ్ వెళ్లింది.

బైక్ ఫోటో తీసిన పోలీసులు.. ఇందుకు సంబంధించిన ఫైన్‌ను కాస్త మహబూబబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం గ్రామంలో ఉన్న ట్రాక్టర్ కు వేశారు. ట్రాక్టర్ నెంబర్ TS 26 E 5350 కు 135 రూపాయల ఫైన్ వేసినట్లు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చేసుకున్న ట్రాక్టర్ యజమాని శేఖర్ .. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ట్రాక్టర్ డ్రైవర్ కు హెల్మెట్ ధరించాలనే నిబంధన లేదు కదా అని ఖంగుతిన్నాడు. అసలు తాను ఈ మధ్య వరంగల్ కే వెళ్లలేదని.. అలాంటప్పుడు ఈ ఫైన్ ఎలా వచ్చిందని షాక్ అయ్యాడు.

అసలు ఈ పొరపాటు ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే బైక్, ట్రాక్టర్ నంబర్ దాదాపుగా ఓకే రకంగా ఉండటం వల్లే ఇలా జరిగిందని ఆ తరువాత అతడికి అర్థమైంది. బైక్ నంబర్‌లో ఉన్న 6 అక్షరానికి బదులుగా 5 కొట్టడంతో ఇలా జరిగింది. ఒక్క అక్షరం పొరపాటుతో టూ వీలర్‌కు రావాల్సిన ఫైన్ మెసేజ్ కాస్త ట్రాక్టర్ యజమానికి వచ్చింది. ఈ పొరపాటును సరి చేయాలని బాధితుడు శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  తనకు చలాన్ వచ్చినందుకు నిరసనగా హెల్మెట్ పెట్టుకుని ట్రాక్టర్ నడుపుతూ సోషల్ మీడియాలో వార్తను వైరల్ చేశాడు సదరు డ్రైవర్.

Also Read:

SBI Online Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఏటీఎం లేకుండా క్యాష్‌ విత్‌ డ్రా.. ఇవిగో వివరాలు

YSR Rice Doorstep Delivery Scheme: ఇంటింటికీ రేషన్ డెలివరీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై