SBI Online Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఏటీఎం లేకుండా క్యాష్‌ విత్‌ డ్రా.. ఇవిగో వివరాలు

మీకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐలో ఖాతా ఉందా ? ఏటీఎం కార్డు మీతో లేనప్పుడు నగదు ఎలా విత్ డ్రా చేయాలా అని హైరానా పడుతున్నారా.

SBI Online Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఏటీఎం లేకుండా క్యాష్‌ విత్‌ డ్రా.. ఇవిగో వివరాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 31, 2021 | 12:59 PM

SBI Online Banking: మీకు దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐలో ఖాతా ఉందా ? ఏటీఎం కార్డు మీతో లేనప్పుడు నగదు ఎలా విత్ డ్రా చేయాలా అని హైరానా పడుతున్నారా. అయితే మీ కోసం గుడ్ న్యూస్ తెచ్చేశాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త ఫీచర్‌ని తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్న వారు డెబిట్ కార్డు లేకున్నా ఎంపిక చేసిన కొన్ని ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది.

ఎస్‌బీఐ ఖాతా ఉన్నవారు ఎవరైనా యోనో యాప్ ద్వారా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్‌ అవ్వొచ్చు. ఆపై యోనో క్యాష్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఏటీఎం సర్వీసుకు వెళ్లి మీరు విత్‌ డ్రా చేయాలనుకుంటున్న నగదును ఎంటర్ చేయాలి. తర్వాత ఎస్‌బీఐ నుంచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌బీఐ యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నంబర్ వస్తుంది. ఎస్‌బీఐ  ఖాతాదారుడు ఈ పిన్‌ను ఎస్‌బీఐ యోనో క్యాష్ పాయింట్లలో ఉపయోగించాలి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఉంది. నగదు విత్ డ్రా చేయడానికి..మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఎస్‌బీఐ యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నెంబర్ 4 గంటల వరకు మాత్రమే వర్కవుతుంది.

కాగా ఎస్‌బీఐ ఏటీఎమ్ సెంటర్స్‌ వద్ద  ఖాతాదారుడు ఏటిఎమ్ స్క్రీన్‌పై కనిపించే  కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత యోనో క్యాష్‌ సెలెక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాలి. మీకు దగ్గర్లో ఉన్న కార్డ్ లెస్ ఏటీఎం సెంటర్లను యోనో యాప్ ద్వారా గుర్తించవచ్చు. అయితే యోనో యాప్ ఉపయోగించి గరిష్టంగా పదివేల రూపాయలను మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు.

Also Read:

ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన గోమాత.. అంతర్వేది ఆలయ గోశాలలో అరుదైన ఘటన

రైతు ఏడాదంతా కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకు ఖాతాలో వేశాడు.. ఐదు నిమిషాల వ్యవధిలో హాంఫట్ చేశారు కేటుగాళ్లు