YSR Rice Doorstep Delivery Scheme: ఇంటింటికీ రేషన్ డెలివరీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఇంటింటికీ రేషన్‌ పథకంపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో జగన్ సర్కార్ హౌస్‌ మోషన్‌ పిటిషన్​ను వేసింది.

YSR Rice Doorstep Delivery Scheme: ఇంటింటికీ రేషన్ డెలివరీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై
Follow us

|

Updated on: Jan 31, 2021 | 1:42 PM

YSR Rice Doorstep Delivery Scheme: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఇంటింటికీ రేషన్‌ పథకంపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో జగన్ సర్కార్ హౌస్‌ మోషన్‌ పిటిషన్​ను వేసింది. ఇంటింటికీ రేషన్‌ పథకం అమలుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్​లో కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నిబంధనలకు లోబడే కార్యక్రమం నిర్వహించాలని హైకోర్టు పేర్కొంది. రాజకీయ పార్టీలు, నేతల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని ఆదేశించింది.

కార్యక్రమ వివరాలతో 2 రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని సూచించింది. ప్రభుత్వ అభ్యర్థనపై ఎస్‌ఈసీ 5 రోజుల్లో నిర్ణయం తెలపాలని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పేద ప్రజల కోసం పథకం కాబట్టి ఎస్ఈసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Also Read:

AP Local Body Elections Live Updates: ఏపీలో రసవత్తరంగా పంచాయతీ పోరు.. నేటితో ముగియనున్న తొలిదశ నామినేషన్ల పర్వం..  

కృష్ణాజిల్లాలోని ఎస్‌బీఐ బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. నిరక్షరాస్యులైన ఖాతాదారులే టార్గెట్‌గా భారీ మోసం.. తస్మాత్ జాగ్రత్త..