ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం ఎంతో మర్మమైనది. ఎన్నో రహస్యాలతో కూడుకున్నది. ఈ రోజు అలాంటి ఒక సరస్సు గురించి తెలుసుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు. ఈ సరస్సు నీటిని ఎవరు తాగినా వారు చనిపోతారు.ఈ సరస్సు దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్‌లో ఉంది. దీనిని ఫుండుజీ సరస్సు అని పిలుస్తారు. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం పురాతన కాలంలో ఒక ప్రదేశం నుంచి సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇక్కడకు ఓ కుష్ఠురోగి వస్తాడు. అతడికి ప్రజలు ఆహారం, ఆశ్రయం ఇవ్వలేదు. దీంతో అతడు ప్రజలను శపించి సరస్సులోకి దూకి అదృశ్యమయ్యాడని చెబుతారు.
ముతాలి నది ప్రవాహాన్ని అడ్డుకున్న కొండచరియ కారణంగా ఈ సరస్సు ఏర్పడిందని చెబుతారు. నది నీరు చాలా శుభ్రంగా ఉంటుంది కానీ ఎవరైనా తాగారంటే త్వరలో చనిపోతారు. నీటి రహస్యాన్ని కనుగొనుటకు అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రతిసారీ పరిశోధకులు విఫలమయ్యారు. 1946 లో ఆండీ లెవిన్ అనే వ్యక్తి సరస్సు నీటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాడు. అతను ఈ సరస్సు నుంచి కొంచెం నీరు తీసుకొని సరస్సు చుట్టూ ఉన్న కొన్ని మొక్కలను తీసుకొని వెళ్లాడు. కానీ అతను కొంత దూరం నడిచాక దారి తప్పాడు.
ఆండీ లెవిన్ నీళ్ళు, మొక్కలను విసిరే వరకు అక్కడక్కడే తిరిగాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత అతను మరణించాడు. ఈ సరస్సులో ఏమి ఉందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ సరస్సు నీటిలో కొన్ని ప్రమాదకరమైన విష వాయువు ఉందని కొంతమంది నమ్ముతారు. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు.