ఖమ్మం జిల్లాలో వింత చోటుచేసుకుంది. కారేపల్లి మండలం వెంకటయి తండాలోని రామాలయంలో ఉన్న రాముడి విగ్రహం కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయంటూ ఆనోటా ఈ నోటా ప్రచారం జరుగుతుంది. ఈ వింతను చూడటానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇలా జరగడానికి గల కారణాలపై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న వైపరిత్యాల నేపథ్యంలో.. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మున్ముందు మానవజాతికి రాబోతున్న మరిన్ని కష్టాలకు రాముడి కంట కన్నీరే సాక్షమని కొందరు అంటున్నారు. ఘటనపై సదరు తండా వాసులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి ఏమైనా అరిష్ఠం జరతుందనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ప్రస్తుతం రాముడి విగ్రహం కంటి నుంచి నీరు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Also Read: తిమింగలం వాంతి పేరుతో దోచేస్తున్నారు.. సీన్‌లోకి సులేమాన్ స్టోన్ కూడా