Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే

|

Jan 01, 2022 | 3:54 PM

ఈ మధ్య కొన్ని ఘటనలు చూస్తుంటే మన కళ్లను మనమే నమ్మలేకుండా ఉండేలా ఉంటున్నాయి. ఇందులో కొన్ని వింతగా ఉంటే, మరికొన్నేమో వింతతో పాటు విషాదకరంగా ఉంటున్నాయి.

Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే
Plastic Baby
Follow us on

ఈ మధ్య కొన్ని ఘటనలు చూస్తుంటే మన కళ్లను మనమే నమ్మలేకుండా ఉండేలా ఉంటున్నాయి. ఇందులో కొన్ని వింతగా ఉంటే, మరికొన్నేమో వింతతో పాటు విషాదకరంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఓ ఘటనే అందరినీ ఆశ్చర్యంతో పాటు కంటతడి పెట్టిస్తోంది. ఓ తల్లి ప్లాస్టిక్‌ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది సరదాగా చెబుతున్న మాట కాదు. నిజంగానే ప్లాస్టిక్‌ బిడ్డే పుట్టింది.

వివరాల్లోకి వెళ్తే..  ఔరంగాబాద్‌లోని సోహ్డాకు చెందిన ఓ మహిళ ఓ ఆసుపత్రిలో ఈ శిశువుకు జన్మనిచ్చింది. బుజ్జాయి శరీరం మొత్తం ప్లాస్టిక్‌తో చుట్టి ఉండటంతో తొలుత డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తేరుకుని విశ్లేషించిన అనంతరం ఇలాంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీస్ అని పిలుస్తుంటారని తెలిపారు. ప్రజంట్  చిన్నారి ఆరోగ్యం చాలా బాగుందట. ప్రపంచంలో పుట్టిన 11 లక్షల మంది శిశువుల్లో ఒకరు కొల్లాయిడ్ బేబీ జన్మిస్తుంటారని.. సదరు ఆస్పత్రికి చెందిన వైద్యుడు వెల్లడించారు. అయితే ఇక్కడ బాధకరమైన వార్త ఏంటంటే.. ఈ బేబి ఎంతకాలంలో ఆరోగ్యంగా ఉంటుందో చెప్పలేమని వైద్యలు తెలిపారు. అంతేకాదు.. ఆ బేబి ఎన్నాళ్లు ప్రాణాలతో ఉంటుందో చెప్పలేమని వివరించారు.

అయితే ఇలాంటి అరుదైన వ్యాధి రావడానికి కారణం తల్లిదండ్రుల కణాల్లోని లోపమే అని స్పష్టం చేశారు వైద్యులు. ఒక్కోసారి తండ్రి స్పెర్మ్‌లో అసాధారణత వల్ల ఇలాంటి బిడ్డ పుట్టేందుకు ఛాన్స్‌ కూడా ఉందని స్పష్టం చేశారు ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌ఛార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ దినేష్‌ దూబే. అయితే ఈ ప్లాస్టిక్‌ పొర క్రమంగా పగిలిపోతుందని, దాంతో భరించలేనంత నొప్పి వస్తుందని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఈ ఇన్ఫెక్షన్‌ పెరిగితే చనిపోయే అవకాశం కూడా ఉందంటూ డాక్టర్లు వెల్లడించారు. గత ఏడేళ్లలో కొల్లాయిడ్ బేబీస్ ముగ్గురు జన్మించగా..  ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మూడో వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని వైద్య నిపుణులు తెలిపారు.

Also Read: Jagtial: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం ఆపగా.. పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మందుబాబు

ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. కనిపెడితే మీ చూపుల్లో పదునున్నట్లే…