Viral video: నిత్యం సోషల్ మీడియాలో అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సాధారణంగా పాములు పొలాలలో, అడవుల్లో ఎక్కువ గా కనిపిస్తుంటాయి. చిన్న చిన్న పాముల దగ్గరనుంచి విషసర్పాలు, భారీ అనకొండల వరకు ఎదో ఒక దగ్గర మనుషుల కంట పడుతూనే ఉంటాయి.
అయితే మాములుగా పామును చూస్తేనే మనం పరుగులు పెడతాం.. అదే పాము అనుకోకుండా మన ఇంట్లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా గుండె ఆగినంత పనవుతుంది. అయితే ఇక్కడ ఓ భారీ సర్పం ఏకంగా అపార్ట్ మెంట్ లోకే వచ్చేసింది. దర్జాగా మెట్లపైనుంచి అపార్ట్ మెంట్ పైకి ఎక్కుతుంది.
ఓ భారీ కొండ చిలువ అపార్ట్ మెంట్ లోకి వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కొండచిలువ మెట్లపక్కన ఉన్న గోడపై పాకుతూ పైకి వెళ్తున్న దృశ్యాలను చూడవచ్చు. ఆ భారీ కొండచిలువ అపార్ట్ మెంట్ పైకి పాకుతున్న దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగుర్లుపొడిచేలా ఉంది. నిజానికి ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :
14 అడుగుల పొడవైన కళింగ సర్పం.. మూడు రోజులుగా ఒకే చెట్టుపై …!:14 Feets Snake Video.