సముద్రంలోని ఆ ప్రదేశం చాలా లోతు..! ఎవరెస్ట్ పర్వతం ఉంచినా మునిగిపోతుంది..

|

Oct 02, 2021 | 8:59 PM

Mariana Trench: సముద్రంలో ఏదైనా వేస్తే అది ఎంత లోతుకు వెళుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే సాధారణంగా సముద్రపు లోతు

సముద్రంలోని ఆ ప్రదేశం చాలా లోతు..! ఎవరెస్ట్ పర్వతం ఉంచినా మునిగిపోతుంది..
Pacific
Follow us on

Mariana Trench: సముద్రంలో ఏదైనా వేస్తే అది ఎంత లోతుకు వెళుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే సాధారణంగా సముద్రపు లోతు గురించి చాలా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి సముద్రం లోతు భిన్నంగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఒక ప్రదేశం ఉంది. అక్కడ లోతు అత్యధికంగా ఉంటుంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రానికి తూర్పున మరియానా దీవులకు పక్కన ఈ ప్రదేశం ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే చాలా లోతుగా ఉండటం.

పర్వతాల ఎత్తు గురించి మీరు వినే ఉంటారు. ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం గురించి అందరికి తెలుసు. ఒకవేళ ఎవరెస్ట్ పర్వతం తీసుకొచ్చి ఈ మరియానా ప్రదేశంలో ఉంచితే అది కూడా మునిగిపోతుంది. అంటే ఇది ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కంటే లోతుగా ఉంటుంది. మరియానా ప్రదేశం సగటున 1,500 మైళ్ళు (2,550 కిలోమీటర్లు) పొడవు, 43 మైళ్ళ (69 కిలోమీటర్లు) వెడల్పు ఉంటుంది. మరియానా ట్రెంచ్ అనేది సముద్రపు అడుగుభాగాన్ని దాటిన లోతైన భాగం.1875లో బ్రిటిష్ షిప్ ద్వారా మరియానా ట్రెంచ్ లోతును కొలిచారు.1951లో ఎకో-సౌండర్ ద్వారా కొలిచారు. అయితే ఈ ప్రదేశం లోతు గురించి కచ్చితమైన లెక్కలు నిర్ధారించలేదు.

నివేదికల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ లోతుకు వెళ్లారు. వారు ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 11,022 మీటర్లు (36,070 అడుగులు) దిగువన ఉందని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో దాదాపు 11 వేల కిలోమీటర్లు అని చెప్పవచ్చు. ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి 8,848 మీటర్లు ఎత్తులో ఉంటే మరియానా కందకం 10,916 మీటర్లు (ఎవరెస్ట్ పర్వతం కంటే 2068 మీటర్లు ఎత్తు) లోతుగా ఉంటుంది. రిటైర్డ్ యుఎస్ లెఫ్టినెంట్ డాన్ వాల్ష్, అతని సహోద్యోగి, దివంగత జాక్వెస్ పికార్డ్ 1960 లో జలాంతర్గామిలో 10,790 మీటర్ల లోతుకు వెళ్లారు. మరియానా ప్రదేశం ఫిలిప్పీన్స్‌కు తూర్పున ఉంటుంది.

IPL 2021: క్రిస్‌ గేల్‌కి ఏమైంది.. ఎందుకు విఫలమవుతున్నాడు.. మాజీ ఆటగాళ్లు ఏం చెబుతున్నారు..

Siddharth: చికిత్స అనంతరం ఇండియాకు తిరిగివచ్చిన సిద్ధార్థ్.. కోలుకుంటున్నానని ప్రకటన

Farmers Protest: రైతుల ఆందోళనకు దిగివచ్చిన కేంద్రం.. రేపటి నుంచి పంట కొనుగోళ్లకు హర్యానా, పంజాబ్‌ గ్రీన్‌సిగ్నల్..!