Viral: వారాల తరబడి మిస్టరీ చెట్టు నుంచి వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం.. రంగంలోకి అధికారులు

చెట్టు ఆక్సిజన్‌ను రిలీజ్ చేస్తుంది అని తెలుసు.. చిక్కటి నీడను.. ఫలాలను, పుష్పాలను ఇస్తుంది అని తెలుసు.. కానీ చెట్టు నుంచి వర్షం కురవడం మీరు ఎప్పుడైనా చూశారా..?

Viral: వారాల తరబడి మిస్టరీ చెట్టు నుంచి వర్షం.. ఆశ్యర్యపోతున్న జనం.. రంగంలోకి అధికారులు
Mystery Rain
Follow us

|

Updated on: Jun 11, 2022 | 4:12 PM

Trending: మాములుగా అయితే మేఘాలు వర్షిస్తాయి.  ఆకాశం నుంచి చినుకులు పడతాయి. కానీ కర్ణాటకలో మాత్రం ఓ మిస్టరీ వాన కురస్తోంది. ఓ చెట్టు నుంచి నిర్విరామంగా చినుకుల జల్లు పడుతుంది. ఈ ఘటన స్థానికులతో పాటు అధికారులను విస్మయానికి గురి చేస్తుంది. ఎండాకాలం.. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం కూడా ఈ వర్షపు జల్లు ఆగడం లేదు. అసలు ఆ వర్షం ఎక్కడ నుంచి పడుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు.  కొమ్మల నుంచి 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో నీరు పడుతోంది. గంటలు, రోజులు కాదు.. గత కొన్ని వారాలుగా ఈ వర్షపు జల్లు ఆగడం లేదు. కర్ణాటక(Karnataka )లోని కొడగు(Kodagu) సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఈ విచిత్ర చెట్టు ఉంది. ఈ చెట్టు శివుడికి ఇష్టమైన బిల్వ పత్ర వృక్షమని అక్కడి స్థానికులు చెప్తున్నారు. అందుకే ఇలా జరుగుతుందని అంటున్నారు. చెట్టుకు 500 మీటర్ల దూరంలోని దేవరకాడులో భద్రకాళిదేవి ఆలయం ఉంది. ఆ అమ్మవారి మహిమ వల్లే.. ఇలా జరుగుతుందని  మరికొందరు అంటున్నారు.  ఆ నోటా, ఈ నోటా పాకడంతో.. ఈ వర్షపు జల్లు కురిపిస్తున్న చెట్టును చూసేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకుంటున్నారు. కాగా  కొన్ని రకాలైన చెట్లకు ఇలాంటి లక్షణాలు ఉంటాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వారు ఈ చెట్టు నుంచి పడే నీటిని పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపారు. కాగా విపత్తు నిర్వహణ అథారిటీ, పర్యావరణ అధికారులు.. ఈ చెట్టును సందర్శించేందుకు విచ్చేయనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest Articles