Elephants Hulchal: హైవే మీద చెరుకు లారీని ఆపి.. గంటపాటు తిన్న ఏనుగులు, బారులు తీరి నిలిచిపోయిన వాహనాలు

తమిళనాడులోని ఈరోడ్డు జిల్లా సత్యమంగళం దగ్గర హైవేపై ఏనుగులు హాల్‌చల్ చేశాయి. మైసూరు జాతీయ రహదారిపై చెరుకు..

Elephants Hulchal: హైవే మీద చెరుకు లారీని ఆపి.. గంటపాటు తిన్న ఏనుగులు, బారులు తీరి నిలిచిపోయిన వాహనాలు
Elephants

Updated on: Aug 07, 2021 | 9:11 AM

Elephants Hulchal: తమిళనాడులోని ఈరోడ్డు జిల్లా సత్యమంగళం దగ్గర హైవేపై ఏనుగులు రాత్రివేళ హాల్‌చల్ చేశాయి. మైసూరు జాతీయ రహదారిపై చెరుకు లోడుతో వెళుతున్న లారీని అడ్డగించిన తల్లి, పిల్ల ఏనుగులు.. లారీలో ఉన్న చెరుకును తినడం మొదలుపెట్టాయి. గంటకు పైగా రోడ్డుపైనే ఉన్న ఏనుగులు.. ఎలాంటి అదురూ.. బెదురూ లేకుండా నెమ్మదిగా తమ పని కానిచ్చుకున్నాయి.

దీంతో సత్యమంగళం వద్ద మైసూరు జాతీయ రహదారిపై గంటలపాటు ట్రాఫిక్ నిలిచి పోయింది. లారీలతోపాటు, అనేక వాహనాలు రోడ్డు మీదే నిల్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆకలితో ఏనుగులు హైవే మీదకు రావడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

Read also: Nirmala Sitharaman: ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర ఆర్థికమంత్రి పర్యటన.. పొందూరులో చేనేత వేడుకల్లో పాల్గోనబోతోన్న నిర్మలా సీతారామన్‌