ఏడాది క్రితం అనుకోకుండా సరస్సులో పడిపోయిన ఐఫోన్.. ఇప్పుడు దొరికింది.. అప్పట్లానే పనిచేస్తుంది.. రీజన్ ఇదే

ప్రస్తుతం తైవాన్ ప్రజలు తీవ్రమైన కరువు సమస్యతో పోరాడుతున్నారు. వేసవి కారణంగా అక్కడి సరస్సులు, చెరువులు ఇంకిపోయాయి. పశుపక్ష్యాధులు..

ఏడాది క్రితం అనుకోకుండా సరస్సులో పడిపోయిన ఐఫోన్.. ఇప్పుడు దొరికింది.. అప్పట్లానే పనిచేస్తుంది.. రీజన్ ఇదే
Iphone In Lake
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2021 | 6:55 PM

ప్రస్తుతం తైవాన్ ప్రజలు తీవ్రమైన కరువు సమస్యతో పోరాడుతున్నారు. వేసవి కారణంగా అక్కడి సరస్సులు, చెరువులు ఇంకిపోయాయి. పశుపక్ష్యాధులు నీటి కొరతను ఎదుర్కుంటున్నాయి.  కానీ ఆ కరువే ఓ వ్యక్తికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. సదరు వ్యక్తి గతంలో పోగొట్టుకున్న తన ఖరీదైన ఐఫోన్‌ను తిరిగి పొందగలిగాడు. అతడి ఐఫోన్ ఏడాది క్రితం తైవాన్‌లోని ఒక సరస్సులో పడిపోయింది. ప్రస్తుతం వర్షం లేకపోవడం, వేసవికాలం అవ్వడంతో ఆ సరస్సు నీరు ఎండిపోయింది. దీంతో సదరు వ్యక్తి తన పొగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి పొందగలిగాడు.

గత ఏడాది సన్ మూన్ లేక్‌లో పాడిల్ ‌బోర్డింగ్ చేస్తున్నప్పుడు తన ఐఫోన్ 11 ను అనుకోకుండా నీటిలో జారవిడిచినట్టు చెన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం తైవాన్‌లో తీవ్రమైన నీటి కొరత ఉంది. అటువంటి పరిస్థితిలో, సన్ మూన్ సరస్సులోని నీటి మట్టం రికార్డు స్థాయి కంటే పడిపోయింది. ఈ క్రమంలో ఆ లేక్‌ వద్ద ఒక వర్కర్ నుంచి చెన్‌కు ఫోన్ వచ్చింది. గతంలో తాను పోగొట్టుకున్న ఐఫోన్ దొరికిందని ఆ వార్త సారాంశం. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే వెళ్లి తన ఫోన్‌ను రికవర్ చేసుకున్నాడు.

దాన్ని శుభ్రపరిచి… ఛార్జింగ్ పెట్టగా.. తిరిగి స్విచ్చాన్ అయ్యిందని.. యధావిధిగానే ఫోన్ పనిచేస్తుందని చెన్ చెప్పారు. ఫోన్ వర్క్ చేస్తున్న ఫోటోను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశాడు. ఒక సంవత్సరం పాటు నీటితో నిండిన సరస్సులో మునిగిపోయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్ ఇప్పటికీ పనిచేస్తుండటం నిజంగా అద్భుతమే. ఆ ఐఫోన్‌కు ఉన్న వాటర్ ప్రూఫ్ కవర్.. ఫోన్‌ను ఇప్పటివరకు తడవకుండా ఆపింది. కాగా ఈ వార్తను విన్నవారందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Also Read: ఈ రాజు ఏడాదికి ఒక కన్యను పెళ్లి చేసుకుంటాడు.. ఇప్పటికి 15 మంది భార్యలు.. ఇంకా

14 వారాలకే కడుపులో బిడ్డ మృతి.. పసికందు కోసం తల్లడిల్లిన మాతృహృదయం.. చివరకు