దెయ్యాలు, భూతాలు ఇంకా ఉన్నాయి అని గ్రామీణా ప్రాంతాల్లో ఇప్పటికీ విశ్వసిస్తుంటారు. తీరని కోరికలతో చనిపోయినవారు దెయ్యాలుగా మారి మనుషుల మధ్యే నివసిస్తుంటారని.. అర్థరాత్రిళ్లు మానవ శరీరాల్లోకి వస్తుంటారని పెద్దలు చెబుతుండేవారు. అయితే మారుతున్న కాలంతోపాటు దెయ్యాలు, భూతాలు అనేవి ఉండవు… కేవలం మనుషులలో ఉండే అపోహాలు మాత్రమే అని కొందరు శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దెయ్యాలు ఉన్నాయని… అక్కడివారిని పిడీస్తున్నాయని అంటుంటారు. అయితే ఓ ఊరు మొత్తం దెయ్యాల భయంతో ఖాళీ అయ్యింది. అక్కడ ఒక్క మనిషి కూడా లేకుండా.. పూర్తిగా ఖాళీ ఇళ్లతో నిశ్శబ్ధం అవహించింది.
ఉత్తరాఖండ్.. దీనినే దేవభూమి అని కూడా పిలుస్తుంటారు. ఈ రాష్ట్రంలో ఓ దెయ్యాల గ్రామం ఉంది. ఆ ఊర్లో మొత్తం ఎనిమిది దెయ్యాలు తిరుగుతుంటాయట. వాటి భయంతో అక్కడి ప్రజలంతా ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారట. ఆ గ్రామాన్ని భూటియన్ గా పిలుస్తుంటారు. ఇప్పటికీ అక్కడ ఒక్క మానవుడు కూడా నివసించడు.
స్వాలా ఉత్తరాఖండ్ చంపపత్ జిల్లాలోని ఓ గ్రామాన్ని భూత్ విలేజ్‌గా పిలుస్తుంటారు. ఈ గ్రామంలో దాదాపు 63 సంవత్సరాల క్రితం.. అంటే 1952 ఆర్మీ సైనికులు వెళ్తున్న కారు ఓ గుంటలో పడిపోయింది. ఆ కారులో మొత్తం 8 మంది సైనికులు ఉన్నారు. అయితే వారు ప్రమాదం జరిగిన తర్వాత సాయం కోసం ఆ ఊరి వాళ్లను ప్రాదేయపడగా.. ఆ గ్రామస్తులు వారిని పట్టించుకోలేదు. వారికి సాయం చేయడానికి బదులుగా.. ఆర్మీ సైనికుల వస్తువులను దొంగిలించుకుపోయారట. ఒకవేళ ఆ గ్రామస్తులు వారికి సాయం చేసి ఉంటే.. అందులో కొంతమంది జవాన్లు బతికి ఉండేవారు. అయితే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆ 8 మంది సైనికుల ఆత్మలు అక్కడే నివసిస్తున్నాయని.. వారు గ్రామస్తులను వేధించడం మొదలు పెట్టారని చెబుతుంటారు. దీంతో అక్కడి వారంతా ఇళ్లను ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక కొద్ది రోజుల తర్వాత ఆ సైనికుల ఆత్మల శాంతి కోసం.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నవ్ దుర్గా దేవి ఆలయం స్థాపించబడింది. ఆ దారి నుంచి వెళ్లే ప్రతి వాహనం అక్కడ కచ్చితంగా ఆగాలి.