Bladderwort Plant : మనుషులే కాదు.. కొన్ని ప్రాణం ఉన్న జీవులతో పాటు మొక్కల్లో కూడా మాంసాహారులు. శాఖాహారులు ఉన్నారు. మేక , కుందేలు, జింకలు శాఖాహారులు,, సింహం, పులి నక్క , కుక్క ఇవన్నీ మాంసాహారం తినేవి, అలాగే మొక్కల్లో కూడా కీటకాలనే కాదు ఏకంగా బల్లులను కూడా పట్టుకుని తినేసేవి ఉన్నాయి. మరి ఆ మాంసాహారపు మొక్క గురించి తెలుసుకుందాం
ఈ మాంసాహార మొక్కపేరు ‘బ్లాడర్ వోర్ట్స్’. చిన్న చిన్న కొలనుల్లో, చెరువుల్లో జీవిస్తుంది ఈ మొక్క. చూడడానికి చాలా అందంగా ఉంటుంది.. దీంతో ఈ మొక్కకు క్రిమికీటకాలను ఆకర్షింపబడతాయి. అలా వచ్చిన కీటకాలు తన పైన వాలిన వెంటనే .. చటుక్కున పట్టుకుని గుటుక్కున మింగేస్తుంది. .
‘బ్లాడర్ వోర్ట్స్ మొక్క ఆహారంగా క్రిమికీటకాలను చంపే విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్య వేయడం కాయం. సన్నగా, పొడవుగా నీళ్లపై తేలియాడే మొక్క ఆకులే ఈ మొక్కకు ఆయుధాలు. పత్రాల మీద కీటకం వాలగానే ఆకులూ ముడుచుకుని పోతాయి. అలా ఆకుల మధ్యలో చిక్కుకున్న కీటకాన్ని ఆకులు పీల్చిపిప్పి చేస్తాయి. ఇది చూస్తే ఎవరికైనా మొక్క ఎంత తెలివైందా అనిపిస్తుంది. ఈ మొక్కలు కీటకాలతో పాటుగా చిన్నపాటి బల్లులను కూడా తినేస్తుంది. ఈ మొక్క బల్లులు తింటుంది అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈగలు, దోమలు లాంటి క్రిమికీటకాలతో పాటుగా, బల్లులను తింటున్న ఈ మొక్క మనకు మేలు చేస్తుందని అంటున్నారు శాస్త్రజ్ఞులు
Also Read: మా అంపశయ్యమీద ఉంది.. ఆ నలుగురు హీరోలు సమస్యలను పరిష్కరించాలంటూ ఓ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు