Hollow earth theory: భూమి లోపల మరో ప్రపంచం.. ఏలియన్స్‌ అక్కడా ఉన్నారా..? ఆసక్తికర విషయాలు

సుదూరంలో ఉన్న అంతరిక్షంలో ఏముంది.? ఒక భూమ్మీదే జీవం ఉందా..? వేరే గ్రహాలపై ఏం ఉంటుంది.? విశ్వంలో మానవజాతితో పాటు మరికొన్ని జీవులుంటే అవి ఏ రూపంలో ఉన్నాయి.?

Hollow earth theory: భూమి లోపల మరో ప్రపంచం.. ఏలియన్స్‌ అక్కడా ఉన్నారా..? ఆసక్తికర విషయాలు
Hollow Earth Theory

Updated on: Jul 23, 2021 | 9:02 PM

సుదూరంలో ఉన్న అంతరిక్షంలో ఏముంది.? ఒక భూమ్మీదే జీవం ఉందా..? వేరే గ్రహాలపై ఏం ఉంటుంది.? విశ్వంలో మానవజాతితో పాటు మరికొన్ని జీవులుంటే అవి ఏ రూపంలో ఉన్నాయి.? ఈ ప్రశ్నలే శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటిపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నా.. ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ ఏలియన్స్‌ ఉన్నాయని కొందరు వాదిస్తే, అవి నిజంగానే ఏదో గ్రహంపై ఉండి ఉంటే మనతో ఎందుకు కాంటెక్ట్‌ కాలేకపోతున్నాయన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి ప్రశ్నలకు మరింత ఆజ్యం పోస్తూ.. ఇప్పుడు తాజాగా Hollow earth theory వర్షన్‌కు సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భూ ఉపరితలంలో కచ్చితంగా ఏలియన్స్‌ ఉండి ఉంటారని అభిప్రాయపడుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు.

నిజానికి ఎర్త్‌ సర్‌ఫేజ్‌పై పెద్ద హోల్‌ చేసుకుంటూ వెళ్తే ఏం వస్తుంది.? మట్టి, రాళ్లు, అలాగే బంగారం కన్నా విలువైన మెటల్స్ కనిపిస్తాయి. అయితే వీటన్నింటిని దాటుకుంటూ వెళ్లినప్పుడు ఏకంగా ఓ ప్రపంచమే కనిపిస్తే..! ఏంటి.. భూమి లోపల మరో ప్రపంచమా..? అని షాక్‌ అవుతున్నారా..? అవును మీరు విన్నది ముమ్మాటికి నిజం అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు కొందరు సైంటిస్టులు. భూ ఉపరితలాన్ని దాటుకుంటూ వెళ్లితే ఓ నాగరికత, లేదా విచిత్ర మనుషుల జీవం ఉంటుందని Hollow earth theory చెబుతుంది. ఈ థీయరిని ఇప్పటికే ఎన్నో ఏషియన్‌ కల్చర్స్‌ నమ్మాయి. అంతేకాదు ఏషియన్స్‌, గ్రీక్‌, రోమన్స్‌ కూడా భూమిలో ప్రపంచం ఉందని నమ్మారు. అందుకే మొదట్లో గ్రీకు సైంటిస్టులు, హలోవర్త్‌ని మైథలాజికల్‌ బిలిఫ్‌గానే చూశారు.

ఇక ఈ ఎర్త్‌లో ఉండే జీవం మనకన్నా వందరేట్లు అప్‌డేట్‌ వర్షన్‌లో ఉంటుందంట. మనం ఏవిధంగా అయితే అంతరిక్షంలో లేదా ఇతర గ్రహాలపై ఏలియన్స్‌ ఉంటాయని అనుకుంటున్నామో.. అదే విధంగా భూ ఉపరితలం కింద కూడా అలాంటి వారే ఉంటారని తెలుస్తోంది. కొన్ని సార్లు ఆకాశంలో కనిపించే ఫ్లైయింగ్‌ సాసర్లు, విచిత్ర ఆకారంలో ఉండే వస్తువులు కనిపించడం మనం చాలానే చూశాం. అయితే వాటన్నింటిని ఏలియన్సే పంపించి, మనల్ని కాంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు సైంటిస్టులు.

ప్లానెట్‌లో మరో సూర్యుడు ఉన్నాడని, రాత్రి వేళలో సూర్య వెలుగు తగ్గుతుందని, ఉదయం సమయంలో సూర్య వెలుగు పెరుగుతుందంటా. అయితే ఇవన్నీ కూడా Hollow earth theoryని బేస్‌ చేసుకుని, హలో ఎర్త్‌ బిలివర్స్‌ చెప్పిన విషయాలు ఇవి. అయితే భూమి లోపలి భాగాల్లో మరో ప్రపంచం ఉందన్న ఆలోచనతో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. మన భూమి యొక్క వ్యాసార్థం.. 6వేల 371కిలో మీటర్లు. అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి కేంద్రానికి ఉన్న దూరం 6వేల 371 కిలోమీటర్లు అన్న మాట. అయితే భూమిలో నిజంగానే మరో ప్రపంచం ఉందా..? అని తెలుసుకునేందుకు.. మానవుడు ఇప్పటి వరకు తవ్వగలిగిన అత్యంత లోతు కేవలం 12 కిలో మీటర్లు. అంటే ఇంకా తవ్వాల్సిన దూరం 6వేల 359కిలో మీటర్లు. ఇది అసలు ఎప్పటికి సాధ్యపడుతుందో తెలియదు కానీ.. ఒకేవేళ మానవుడు ఈ ఫీట్‌ను సాధించగలితే మాత్రం కచ్చితంగా, మరో ప్రపంచాన్ని చూడగలమని చెబుతున్నారు కొందరు సైంటిస్టులు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్

ఏడేళ్ల బాలికపై లైంగికదాడి.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన చిత్తూరు పోక్సో కోర్టు