AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crazy Punishment: తాగి దొరికితే.. ఊరు మొత్తానికి మటన్‌ దావత్‌ ఇవ్వాల్సిందే.. టేస్ట్ అదిరిపోవాలి సుమీ

ఓ మద్యం చుక్క..ఎన్నో అనర్థాలకు మూలం..ప్రతి నేరానికీ మద్యానికి అవినాభావ సంబంధం ఉంటోంది..పేదల కష్టార్జితం మద్యం షాపలు నిలువుదోపిడీ చేస్తున్నాయి.

Crazy Punishment: తాగి దొరికితే.. ఊరు మొత్తానికి మటన్‌ దావత్‌ ఇవ్వాల్సిందే.. టేస్ట్ అదిరిపోవాలి సుమీ
Mutton Dawath
Ram Naramaneni
|

Updated on: Oct 20, 2021 | 10:14 AM

Share

ఓ మద్యం చుక్క..ఎన్నో అనర్థాలకు మూలం..ప్రతి నేరానికీ మద్యానికి అవినాభావ సంబంధం ఉంటోంది..పేదల కష్టార్జితం మద్యం షాపలు నిలువుదోపిడీ చేస్తున్నాయి. వ్యాపారుల కాసులకక్కుర్తితో వీధికి రెండు లిక్కర్‌ షాపులు తెరుచుకుంటున్నాయి..పాలు దొరకని ప్రదేశాలున్నాయి కానీ, మద్యం దొరకని జాగా లేదు..జనం షాపుల ముందు కిక్కిరిసి కనబడతారు..జనానికి అనారోగ్యాన్ని మిగిల్చి బడా కాంట్రాక్టర్లు కోట్లు గడిస్తున్నారు. ఇంకా ఏదైనా జరగరానిది జరిగితే పోలీస్‌ కేసులు, బోనస్‌గా భరించాల్సిందే. ఇలాంటి పరిస్థితులన్నింటికీ దూరంగా ఉంటున్నాయి అక్కడి కొన్ని గ్రామాలు.. గ్రామ పెద్దలు అమలు చేస్తున్న నిబంధనతో అక్కడి వారెవరైనా మందు తాగాలంటేనే భయపడి పోతున్నారు.

మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మద్యపాన నిషేదం అమల్లో ఉంది…మద్యం నిషేదం అమలులో ఉన్న ముఖ్య రాష్ట్రం గుజరాత్‌ అనే చెప్పాలి. ఇక్కడ చాలా జిల్లాల్లో వింతైన నిబంధన పాటిస్తున్నారు ప్రజలు. అహ్మదాబాద్, సురేంద్రనగర్‌, అమ్రేలీ, కచ్‌, మోతిపుర జిల్లాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగుతోంది. గ్రామాల్లో ఊరి మధ్య బోను వంటిది ఏర్పాటు చేశారు. ఎవరైనా మద్యం తాగి వచ్చినట్లయితే రాత్రి అంతా అందులో ఉంచుతారు. ఒక రోజంతా బోనులో ఉన్న తర్వాత 12 వందల రూపాయలు కడితేనే అందులోంచి బయటకు వదిలేస్తారు. అక్కడితో కథ పూర్తి అవ్వదు..అందులో పడ్డ వారు వారంలోపు గ్రామంలోని వారందరికీ కూడా 25వేల రూపాయల ఖర్చుతో మటన్‌ దావత్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

దాదాపుగా ఆ గ్రామం మొత్తం ఆ రోజు వింధులో పాల్గొంటుంది. ఈ శిక్షను కాదనే వారు, పాటించని వారికి గ్రామ బహిష్కరణ ఉంటుంది. గ్రామంలో వారికి ఎవరు కూడా సాయం చేయక పోవడంతో పాటు, వారిని ఎవరు కూడా పట్టించుకోకూడదు. అలా కాకుండా ఉండాలి అంటే 25 వేలు ఖర్చు చేసి గ్రామస్తులందరికి కూడా వింధు ఇవ్వాల్సిందే. వినడానికి వింతగా అనిపించినా గ్రామస్తులంతా ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటున్నారు. పొరపాటున ఎవరైనా తాగితే పొరుగు ఊరిలోనో, లేదంటే గ్రామ శివారులో, పొలాల్లోనే గడపాల్సి ఉంటుంది. కాదని ఊర్లోకి వస్తే పాతిక వేలతో విందు, 12వందల రూపాయలు గ్రామ పంచాయితికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పైగా, ఊళ్లోకి ఎవరైనా తాగుబోతులు వచ్చారని గుర్తించి సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకించి కొందరు మహిళలను ఇన్‌ఫార్మర్లుగా నియమించారు. వారికి 501 రూపాయల నుంచి 11వందల రూపాయల వరకు నజరానాగా చెల్లిస్తున్నారు. అలా చెప్పిన వారిని పేర్లను గోప్యంగా ఉంచుతారు.

కచ్‌ జిల్లాలోని మాండ్వి మండలం గాధీసా గ్రామానికి చెందిన రాజన్ నాట్ 2021 ఏప్రిల్‌ నెలలో ఈ బోను శిక్షను అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనలతో తమ గ్రామాలు ప్రశాంతంగా ఉంటున్నాయని చెబుతున్నారు గ్రామ పెద్దలు. ఇంట్లో భార్య భర్తల గొడవలు, తాగి చనిపోయిన వారి భార్యల కష్టాలు కనిపించకుండా పోయాయంటున్నారు. కొన్ని అసాంఘిక ఘటనలతో పోలీస్‌ కేసులు, జైలు శిక్షలు వంటివి తప్పాయని చెబుతున్నారు. ఇదేదో మన ఊర్లో కూడా అమలు చేస్తే బాగుండేది కదా అనుకుంటున్నారా..? మన దగ్గర చేస్తే..ప్రతి రోజూ మటన్‌ దావతే మరీ..!

Bone

Also Read:  మీరు వాడే వంట నూనె స్వచ్చమైనదా..? కల్తీదా..? ఇలా తెలుసుకోండి..!

ఉదయాన్నే ఈ పదార్థాలు తీసుకుంటున్నారా.. అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే