వింత కండీషన్.. ఈ రెస్టారెంట్‌కి పురుషులు ‘జోడి’తో రావాల్సిందే.!
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని పబ్‌లు, క్లబ్‌లు ...
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని పబ్‌లు, క్లబ్‌లు ‘Stags Are Not Allowed (ఒంటరి పురుషులకు ప్రవేశం లేదు)’ అనే బోర్డులు పెడుతుంటాయి. అయితే జైపూర్‌లోని ఓ రెస్టరంట్ కూడా ఒంటరి పురుషులను అనుమతించడానికి నిరాకరిస్తోంది. తమ హోటల్లోని అద్భుతమైన రుచులను ఆస్వాదించాలంటే కచ్చితంగా జోడీతోనే రావాలని షరతు విధించింది. అసలు వివరాల్లోకి వెళితే ….హర్షితా శర్మ అనే ఓ ట్విట్టర్ యూజర్ తాజాగా ఓ ఫొటోను పంచుకుంది. ఇందులో ఆమె ఓ రెస్టరంట్‌లో ఏసీ కింద దీనంగా కూర్చొని ఉంది. ఇందులో పెద్దగా విశేషమేమీ లేదు కానీ ఆ ఏసీపై ఉన్న పోస్టర్ మాత్రం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘ పురుషులు ఈ హోటల్లోకి అడుగుపెట్టాలంటే జోడీతో రావాల్సిందే’ అని ఆ పోస్టర్‌పై రాసి ఉండడమే దీనికి కారణం. దీనికి తోడు ఫొటోను పంచుకున్న యూజర్ ‘ ఈ హోటల్‌లోని దాల్- రోటీని రుచి చూడడానికే నన్ను తోడుగా తీసుకొచ్చాడు’ అని ఫన్నీగా రాసుకొచ్చింది. ఆ తర్వాత మరొక ట్వీట్‌లో ‘ఇది జైపూర్‌లోని ‘గోపి పవిత్రా భోజనాలయం’. ఇక్కడి ఫుడ్ చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి కచ్చితంగా ట్రై చేయండి’ అని చెప్పుకొచ్చింది.
సింగిల్స్ ఆకలితో చచ్చిపోవాల్సిందేనా?
దీంతో ఒక్కసారిగా ఈ హోటల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘రెస్టరంట్ విధించిన షరతు ఆసక్తిగా ఉంది. రౌడీ మూకలు, తాగుబోతులు, ఆకతాయిల నుంచి మహిళల్ని కాపాడేందుకు ఈ నిర్ణయం సహకరిస్తుంది’ అని కొందరు నెటిజన్లు స్పందించారు. ‘రెస్టరంట్లన్నీ ఇలాంటి కండిషన్లు పెడితే నాలాంటి సింగిల్స్ ఆకలితో చచ్చిపోవాల్సిందేనా?’ అని మరికొంతమంది కామెంట్ చేశారు.
To all those who want to know about the place. It’s Gopi Bhojnalaya in Jaipur. Food is amazing. Must try. pic.twitter.com/TOl8gwk0My
— Harshita Sharma (@Harshita511) October 17, 2021
Tomato Price: మండుతున్న టమోట ధరలు.. సామాన్యుడు విలవిల.. కిలో ధర ఎంతంటే..?
Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..
Dry Cough: పొడి దగ్గుని తక్కువ అంచనా వేయకండి..! తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..