AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bridge collapse: ఉత్తరాఖండ్‌లో బ్రిడ్జి ఎలా కూలిపోతుందో చూడండి..! షాకింగ్‌ వీడియో..

Bridge collapse: ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఎటు చూసినా హృదయ విదారకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముంపు ప్రాంతాలన్ని ఇప్పటికే మునిగిపోయాయి.

Bridge collapse: ఉత్తరాఖండ్‌లో బ్రిడ్జి ఎలా కూలిపోతుందో చూడండి..! షాకింగ్‌ వీడియో..
Uttarakhand
uppula Raju
|

Updated on: Oct 19, 2021 | 4:00 PM

Share

Bridge collapse: ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఎటు చూసినా హృదయ విదారకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముంపు ప్రాంతాలన్ని ఇప్పటికే మునిగిపోయాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలామంది వరదనీటిలో చిక్కుకొనిపోయారు. ఇళ్లపై ఉండి కాపాడాలని కేకలు వేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు భారీ వర్షం ధాటికి కూలిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వం సహాయ చర్యలు కొనసాగిస్తోంది.10 డ్యాంల పరిధిలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇదిలా ఉంటే.. వరద బీభత్సానికి బ్రిడ్జి కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీటిమట్టం పెరగడంతో బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యం అందరిని షాక్‌కి గురిచేస్తుంది. వీడియోలో బ్రిడ్జి కూలుతున్న సమయంలో అటువైపు నుంచి ఒకరు బైక్ పై వస్తుండగా ఇటువైపుగా ఉన్న వ్యక్తి రావద్దని వాదించడం మనం వీడియోలో గమనించవచ్చు. వెంటనే ఆ వ్యక్తి అక్కడే ఆగిపోతాడు. ఆ సమయంలో బ్రిడ్జి మెల్ల మెల్లగా కూలిపోవడం మనం వీడియోలో చూడవచ్చు. హల్ద్వానీలోని గౌలా నదిపై వంతెన వద్ద ఈ సంఘటన జరిగింది.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా గంగానది నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. హరిద్వార్ లోని గంగానదికి సమీపంలో ఉన్న ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. కోసి నదిలో నీరు పెరగడం వల్ల రాంనగర్ గార్జియా దేవాలయానికి ముప్పు ఏర్పడింది. ఆలయం మెట్లు వరకు నీరు చేరింది. అదే సమయంలో బ్యారేజ్ అన్ని గేట్లు తెరిచారు. కోసి బ్యారేజీ వద్ద కోసి నది నీటి మట్టం139000 క్యూసెక్కులు. ఇది ప్రమాద స్థాయిని దాటింది.

Acidity Prevention Tips: మీరు ఎసిడిటితో బాధపడుతున్నారా..? ఇలాంటి చిట్కాలు పాటించినట్లయితే ఎంతో ప్రయోజనం..!

Honour Killing: ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం.. ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు సజీవ దహనం..

Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..