మనదేశంలోని శ్రీనగర్-లేహ్ మార్గంలో నిర్మితమైన టన్నెల్ ను .. కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. దాదాపు 2వేల 680కోట్లు వ్యయంతో నిర్మితమైన ఈ టన్నెల్‌కు.. ఆకారాన్ని తగ్గట్టే జడ్ మోడ్ టన్నెల్‌గా పేరొచ్చింది. ఇంగ్లీష్ అక్షరం జడ్‌ను పోలి ఉంటుంది దీని నిర్మాణం.
6.5 కి.మీ. పొడవున్న రెండు లేన్ల రోడ్డు మార్గం ఇది. పర్వతంపై ఉన్న థాజివాస్ గ్లేసియర్ కింద కశ్మీర్లోని గండెబల్ జిల్లా గగన్‌గీర్-సోన్‌మార్గ్ మధ్య దీన్ని నిర్మించారు. ఇక్కడ ఉష్ణోగ్ర మైనస్ 30 డిగ్రీలవరకు ఉంటుంది. గతంలో లేహ్ చేరడానికి మూడున్నర గంటలు పట్టే ప్రయాణ సమయం.. ఈ టన్నెల్ ప్రారంభంతో పదిహేను నిమిషాలకు తగ్గింది. సముద్రమట్టానికి 2వేల 637 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టన్నెల్ ద్వారా.. ఏడాది పొడవునా రాకపోకలు సాగనున్నాయి.
#WATCH | We will achieve connectivity between Kashmir to Kanniyakumari in the true sense, says Union Minister for Road Transport & Highways, Nitin Gadkari on the construction of the Zojila tunnel in J&K. pic.twitter.com/PK3JRAHZoj
— ANI (@ANI) April 10, 2023
జడ్ మోడ్ టన్నెల్ అందుబాటులోకి రావడంతో ఏడాదిపాటు జమ్ముకశ్మీర్‌కు కనెక్టివిటీ ఏర్పడింది. ఇక ముందు పర్యాటకులు శీతాకాలంలో సైతం కశ్మీర్‌కు ప్రయాణించి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. సైనికపరంగానూ ఇది ఎంతో ఉపయోగకరం కానుంది. సరిహద్దులవరకు రేషన్ సరకులు, ఆయుధాలను సరఫరా చేయడానికి వీలవుతుంది. జమ్ము- శ్రీనగర్ మధ్య మరో 9 టన్నెళ్లను నిర్మిస్తున్నారు. ఆసియాలోనే అతిపొడవైన టన్నెల్ జోజిలా పాస్ దగ్గర నిర్మిస్తున్నారు. దీని పొడవు13.14 కి.మీ కాగా.. 2026 నాటికి జోజిలా టన్నెల్ అందుబాటులోకి రానుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..