AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala crime: సాయసయాత్రలో అపశ్రుతి.. కొండ చీలికల మధ్య చిక్కుకున్న యువకుడు.. కాపాడేందుకు విశ్వప్రయత్నాలు

సాహసయాత్రలు చేసేవారు ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొండలు ఎక్కడం(Trekking), బైక్ రైడింగ్ వంటివి చేసే వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా..

Kerala crime: సాయసయాత్రలో అపశ్రుతి.. కొండ చీలికల మధ్య చిక్కుకున్న యువకుడు.. కాపాడేందుకు విశ్వప్రయత్నాలు
Young Man Trapped
Ganesh Mudavath
|

Updated on: Feb 09, 2022 | 8:46 AM

Share

సాహసయాత్రలు చేసేవారు ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొండలు ఎక్కడం(Trekking), బైక్ రైడింగ్ వంటివి చేసే వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అది వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు.. కొండను ఎక్కుతూ జారి కిందపడిపోయాడు. రెండు కొండల మధ్య చిక్కుకున్నాడు. పాలక్కడ్‌ సమీప మలప్పుజ(Malappuja) ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సోమవారం మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువకుడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి నీరూ, ఆహారం లేకుండా బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.

గమనించిన సహాయకబృందం యువకుడిని బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎంతగా ప్రయత్నించినా యువకుడి దాకా చేరలేకపోతోంది. కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. కొండల మధ్య చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైన్యం సహాయం కోరారు. దీంతో బెంగళూరు నుంచి ఓ ప్రత్యేక దళాన్ని పంపుతున్నట్లు సదరన్‌ కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అరుణ్‌ సీఎంవోకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు తమిళనాడులోని వెల్లింగ్టన్‌ నుంచి మరో బృందం పాలక్కడ్‌కు బయలుదేరింది. సహాయక చర్యల్లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి పారా కమాండోలు సైతం రానున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. కొండ నడుమలో గూడు లాంటి చోట కూర్చొని సాయం కోసం ఎదురుచూస్తున్న బాబును కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళం కూడా ప్రయత్నిస్తోంది.

గత సోమవారం మరో ఇద్దరు మిత్రులతో కలిసి కొండ శిఖరం ఎక్కేందుకు యువకుడు ప్రయత్నించాడు. మిగతా ఇద్దరూ మధ్యలోనే విరమించుకున్నా.. అతడు మాత్రం విజయవంతంగా కొండ శిఖరం చేరుకున్నాడు. ఇదే సమయంలో ఉన్నట్టుండి కిందికి జారిపడి మధ్యలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని సెల్ ఫోన్ సహాయంతో తన మిత్రులకు తెలిపాడు. ఈ క్రమంలో సహాయక బృందాలు బుధవారం సాయంత్రం వరకు యువకుడిని కాపాడే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం వరకూ యువకుడు సురక్షితంగానే ఉన్నాడని, అతడి ఆరోగ్యం సాధారణంగా ఉందని అధికారులు తెలిపారు.

Also Read

Sonal Chauhan: నాగార్జునకు జోడిగా బాలకృష్ణ హీరోయిన్.. ది ఘోస్ట్‌లో లెజెండ్ బ్యూటీ..

Pawan Kalyan : మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా బాధ్యతలు తీసుకోనున్న మాటల మాంత్రికుడు..

Dimple Hayathi: ఆ పాట కోసం ఏకంగా ఆరు కేజీలు తగ్గాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల భామ